OYO Layoffs : ‘ఓయో’లో ఉద్యోగులపై వేటు – సిఇఓ
దురదృష్టకరమన్న రితేష్ అగర్వాల్
OYO Layoffs : ప్రపంచంలో టాప్ మోస్ట్ హాస్పిటాలిటీ రంగంలో పేరొందిన కంపెనీ ఓయోలో ఉద్యోగులను(OYO Layoffs) తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ సిఇఓ రితేష్ అగర్వాల్ ప్రకటించారు. శనివారం ఆయన ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తమ సంస్థలో పని చేస్తున్న కొందరిని బాధతో తొలగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొంత కాలంగా తమ కంపెనీ పురోగతిలో కీలక పాత్ర పోషించారని, వారి సేవలను తాము ఎప్పుడూ మరిచి పోలేమంటూ పేర్కొన్నారు రితీష్ అగర్వాల్. ఎవరినైతే తొలగించామో వారందరికీ ఎలాగోలా ఉపాధి పొందేలా తాము చేయగలిగినదంతా చేస్తామని స్పష్టం చేశారు ఓయో సిఇఓ.
ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగంలో నెలకొన్న ప్రభావం కారణంగా ఇప్పటికే దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. మొదటగా టెస్లా సిఇఓ, చైర్మన్ ట్విట్టర్ బాస్ స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు 9 వేల మందికి పైగా సాగనంపాడు. ఆ తర్వాత మైక్రో సాఫ్ట్ సిఇఓ జుకెర్ బర్గ్ 10, 000 వేల మందిని తీసి వేశాడు.
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా కూడా 10 వేల మందిని తొలగించింది. ఇక ప్రపంచంలోనే పేరొందిన ఇ కామర్స్ సంస్థ అమెజాన్ 10 వేల మందికి మంగళం పాడింది. ఇలా వరుస పెట్టి కంపెనీలు తొలగించడంలో పోటీ పడుతున్నాయి.
ఓయోలో టెక్నాలజీ, కార్పొరేట్ వర్టికల్స్ లో 600 మందిని, రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లలో 250 మందిని తొలగించినట్లు రితేష్ అగర్వాల్ వెల్లడించారు.
Also Read : ఐఐటీ స్టూడెంట్స్ బంపర్ ఆఫర్స్