CJI Chandrachud : పోక్సో చట్టంపై సీజేఐ కీలక కామెంట్స్
సమ్మతి వయస్సుపై ఆసక్తికర వ్యాఖ్యలు
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోక్సో చట్టం కింద సమ్మతి వయస్సుపై ఆందోళనను శాసనసభ తప్పనిసరిగా పరిగణించాలని పేర్కొన్నారు. 18 ఏళ్ల లోపు వారి శృంగార సంబంధాలలో కూడా ఏకాభిప్రాయ లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణిస్తుంది పోక్సో చట్టం.
ఇందులో భాగంగా సమ్మతి వయస్సుకు సంబంధించి ఆందోళనలను శాసనసభ విధిగా పరిష్కరించాలని సీజేఐ పేర్కొన్నారు. ఇద్దరు మైనర్ల మధ్య వాస్తవంగా సమ్మతి ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా పోక్సో చట్టం నిర్దేశించిన తక్కువ వయస్సు ఉన్న వారి కోసం అన్ని లైంగిక చర్యలను నేరంగా పరిగణిస్తుందన్నారు.
ఎందుకంటే చట్టం ప్రకారం వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న చట్ట పరమైన కోణంలో సమ్మతి లేదన్నారు. పోక్సో చట్టంపై రెండు రోజుల జాతీయ సంప్రదింపుల ప్రారంభోత్సంలో సీజేఐ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
న్యాయమూర్తిగా నా కాలంలో ఈ వర్గం కేసులు స్పెక్ట్రమ్ లోని న్యాయమూర్తులకు కష్టమైన ప్రశ్నలను వేస్తాయని తెలుసన్నారు. ఈ సమస్యపై ఆందోళన పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శాసనసభ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు సీజేఐ. ఇదే సమయంలో కౌమార ఆరోగ్య సంరక్షణలో నిపుణులు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud).
|ఇటీవల పలు హైకోర్టులు ఇలాంటి ఆందోళనలను లేవనెత్తడంతో పాటు యుక్త వయసులో ఉన్న వారి మధ్య లైంగిక సంబంధాలు నేరంగా పరిగణించ రాదని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేయడంప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : యోగా..పర్యావరణానికి ప్రయారిటీ