Shyla Pure : ‘ప్యూర్’ అవగాహన విద్యార్థినులకు ఆలంబన
నిర్మాణ్ సంస్థ, తెలంగాణ సర్కార్ తో ఒప్పందం
Shyla Pure : ప్రతి నెల నెలా వచ్చే నెలసరి (మెన్సెస్ ) గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు ప్యూర్ స్వచ్చంధ సంస్థ ప్రయత్నం చేస్తోంది. తెలుగు వారైన ప్రముఖ సామాజిక సేవకురాలు, టెక్ నిపుణురాలలైన శైలా తాళ్లూరి ఆధ్వర్యంలో ప్యూర్ ఆన్ లైన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తోంది.
విద్య, ఆరోగ్యం, ఉపాధి పై ఎక్కువగా ఈ సంస్థ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ప్రధానంగా బాలికలు, యువతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి నెలా వచ్చే నెలసరి సమస్యతో. ఇప్పటికే ఎన్నో స్వచ్చంధ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రుతుక్రమంపై అవగాహన కల్పించే పనిలో కీలకంగా ఫోకస్ పెట్టింది ప్యూర్ సంస్థ. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాలికలు, యువతులు, విద్యార్థినుల్లో సరైన అవగాహన ఉండడం లేదని, అందుకే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు ప్యూర్ సంస్థ నిర్వాహకురాలు శైలా తాళ్లూరి(Shyla Pure).
ఎన్నో ఏళ్లుగా విరామం ఎరుగక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్యూర్ సంస్థ విస్తరించింది. ప్రధానంగా మెన్సస్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో తమతో కలిసి వచ్చే సంస్థలతో కలిసి పని చేస్తోంది.
నెలసరి పట్ల సరైన అవగాహన లేక పోవడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శైలా తాళ్లూరి. ఆమె వృత్తి పరంగా అమెరికాలో ఉంటున్నా తానే ముందుండి నడిపిస్తున్నారు ప్యూర్ సంస్థను. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.
కెరీర్ , గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ వేలాది మంది విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ , బతుకుపై భరోసా ఇస్తున్న నిర్మాణ్ సంస్థతో కలిసి కీలక ఒప్పందాన్ని చేసుకున్నారు శైలా తాళ్లూరి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 6,000 బడుల్లో బాలికలకు నెలసరిపై అవగాహన కల్పించనున్నారు.
ఆ సమయంలో ఎలా ఉండాలి. ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకు సంబంధంచి ప్యూర్ ఫెమ్ పీరియడ్ ఎడ్యుకేషన్ – నిర్మాణ్ కెరియర్ గైడెన్స్ కలిసి ఫెమ్ పీరియడ్ ఎడ్యూకేషన్ పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని వల్ల వేలాది మంది విద్యార్థినులకు మేలు జరగనుంది.
ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా విస్తరించాలని కోరుకుందాం. శైలా తాళ్లూరి చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం.
Also Read : పోక్సో చట్టంపై సీజేఐ కీలక కామెంట్స్