Virat Kohli Ronaldo : రొనాల్డో ఆల్ టైం గ్రేట్ ప్లేయర్ – కోహ్లీ
టోర్నీలను ప్రాతిపదికగా అంచనా తప్పు
Virat Kohli Ronaldo : భారత క్రికెట్ స్టార్ బ్యాటర్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఆల్ టైం గ్రేట్ ప్లేయర్లలో క్రిస్టియానో రొనాల్డో ఒకరని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఖతార్ వేదికగా జరుగుతున్న పిఫా వరల్డ్ కప్ -2022లో అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్స్ లో పోర్చుగల్ 0-1 తేడాతో మొరాకో చేతిలో ఓటమి పాలైంది.
దీంతో కన్నీటి పర్యంతం అయ్యాడు రొనాల్డో. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తీవ్ర భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నాడు. శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశానని, కానీ కాలం తనకు సహకరించ లేదని వాపోయాడు.
మైదానంలోకి దిగిన ప్రతీసారి తాను వంద శాతం ఆడాలని అనుకుంటానని, ఒక్కోసారి ప్రత్యర్థులు కూడా అద్భుతంగా ఆడతారని పేర్కొన్నారు. ఇక క్రిస్టియానో రొనాల్డో చేసిన కామెంట్స్ పై స్పందించాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). ప్రపంచంలోని ఏ ఆటకు చెందిన ప్లేయర్లయినా తమ తమ ఆటకు వంద శాతం పర్ ఫార్మెన్స్ చూయించాలని కోరుకుంటారని పేర్కొన్నాడు.
నాకు తెలిసి ప్రస్తుతం వరల్డ్ లో ఆల్ టైం ప్లేయర్ ఎవరు అంటే తాను ముందుగా రొనాల్డో(Cristiano Ronaldo) పేరు చెబుతానని స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ. అతను తన ఆట తీరుతో లక్షలాది మందికి స్పూర్తిగా నిలిచారని ప్రశంసించారు రన్ మెషీన్. ఫిఫా వరల్డ్ గెలవక పోవడం తన విజయాల శాతాన్ని అంచనా వేయడం తప్పని పేర్కొన్నాడు కోహ్లీ. మొత్తంగా ప్రస్తుతం కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : ‘యువీ’ ధీరుడు క్రికెట్ యోధుడు