Deepa Kiran : ‘దీపా’ క‌థా ప్ర‌స్థానం విజ‌యానికి సోపానం

క‌థ‌లు చెప్ప‌డంలో ఆమెకు ఆమే సాటి

Deepa Kiran : ప్ర‌తి మ‌నిషికి ఓ క‌థ ఉంటుంది. భావోద్వేగాల స‌మూహ‌మే క‌థ‌. ఇప్పుడు క‌థ‌లు చెప్పే వాళ్ల‌కు ఎంతో డిమాండ్ ఉంటోంది. ఎంతో మంది ఎన్నో ర‌కాలుగా త‌మ‌దైన శైలిలో రాణిస్తున్నారు. త‌మ దారుల్లో ప‌రుగులు తీస్తున్నారు. కానీ ఒక్కొక్క‌రు ఒక్కో దానిలో స‌క్సెస్ అవుతారు.

కానీ దీపా కిర‌ణ్ మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్. ఆమె క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం, చెప్ప‌డంలో త‌న‌కు తానే సాటి. ఇలాగా కూడా క‌థ‌లు చెబుతూ మ‌న‌సులు దోచుకుంటార‌ని అనుకోలేం.

కానీ వాస్త‌వం కూడా. దీపా కిర‌ణ్(Deepa Kiran) ఇప్పుడు భార‌త దేశంలో మోస్ట్ పాపుల‌ర్ స్టోరీ టెల్ల‌ర్ . ఎంతలా అంటే రోజులో 20 గంట‌ల పాటు ఆమె క‌థ‌లు చెబుతూనే బ‌తుకు ప్ర‌యాణం చేస్తున్నారు.

ఓ వైపు కుటుంబం మ‌రో వైపు వృత్తి. ఇలా రెండింటిని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ దూసుకు పోతున్నారు. టీచ‌ర్లు, ప్రొఫెస‌ర్లు, అధ్యాప‌కులు, స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారంతా దీపా కిర‌ణ్ కు అభిమానులై పోయారు.

ఆమె చెప్పే క‌థ‌ల కోసం వేచి చూస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది పేరున్న స్టోరీ టెల్ల‌ర్స్ ల‌లో దీపా కిర‌ణ్ కూడా ఒక‌రు అంటే న‌మ్మ‌లేం.

ఆమె త‌న వృత్తిని ఎంత‌గా గౌర‌విస్తారంటే అంత‌లా ప్రేమిస్తారు. దానిలో లీన‌మై పోతారు. మ‌న ఫ్యామిలీలో మ‌న పేరెంట్స్ చిన్న‌ప్పుడు చెప్పే క‌థ‌లు లాగేనే ఉంటాయి ఆమె చెప్పే క‌థ‌లు. విస్తృతంగా చ‌దువుతారు.

విద్యాధికారులు, వ‌క్త‌, మంచి క‌థ‌కురాలు, ర‌చ‌యిత్రి, అంత‌కు మించి క‌థ‌లు చెప్పే విధానంలోనే ప్ర‌త్యేక‌మైన శైలిని క‌లిగి ఉన్నారు.

క‌థ‌లు చెబుతూ స‌క్సెస్ కావ‌డం అన్న‌ది దీపా కిర‌ణ్ సాధించిన విజ‌యాల‌లో ఒక‌టి. ఆమె స్టోరీ ఆర్ట్స్ ఫౌండేష‌న్ ను స్థాపించారు. బ‌హు భాష‌ల్లో క‌థ‌లు చెబుతారు. విద్యా వేత్త‌, ఉత్స‌వ నిర్వాహ‌కురాలిగా ఉన్నారు. రీసెర్చ్ చేశారు. 

అంతే కాదు వ‌ర‌ల్డ్ వైడ్ గా పేరొందిన టెడెక్స్ మాధ్య‌మంలో త‌ను పాల్గొన్నారు. అంద‌రినీ విస్మ‌య ప‌రిచారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పేరుంటేనే కానీ పిల‌వ‌రు. 

కానీ దీపా కిర‌ణ్(Deepa Kiran) ఆహ్వానం అందుకున్నారు. భార‌త దేశానికి పేరు తీసుకు వ‌చ్చారు. ప‌లు దేశాల‌ను సంద‌ర్శించారు. 

కేవ‌లం స్టోరీలు చెప్పేందుకు మాత్ర‌మే. మంచి స్పీక‌ర్ గా పేరొందారు. ర‌చ‌యిత్రి, వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్ట్ గా ప‌ని చేశారు. న‌టిగా రాణించారు. పుర‌స్కారాలు

అందుకున్నారు. ఎన్నో అభినంద‌న‌లు కూడా.

1998 నుండి విద్య‌, క‌మ్యూనికేష‌న్ , ప్ర‌ద‌ర్శ‌న‌ల క‌ళ‌ల రంగాల‌లో ఉన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా, భార‌త దేశం అంత‌టా 1,00,000 మంది పిల్ల‌ల‌తో ప‌ని చేశారు దీపా కిర‌ణ్ .

దేశంలోని 26 రాష్ట్రాల‌కు చెందిన 40 వేల మంది టీచ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. కొలంబియా, క‌జ‌కిస్తాన్ , థాయ్ లాండ్ , యూకేడార్ ల‌లో క‌థ‌లు చెప్పారు. అంత‌ర్జాతీయ క‌థా ఉత్సవాల‌లో పాల్గొన్నారు.

స్కాట్లాండ్ , ఇరాన్ , ఆస్ట్రియా , ద‌క్షిణాఫ్రికా, ఇండోనేషియాలలో కూడా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు దీపా కిర‌ణ్. హైద‌రాబాద్ లిట‌ర‌రీ పెస్ట్ లో పాల్గొన్నారు.

వ‌ర‌ల్డ్ స్టోరీ టెల్లింగ్ లో కీల‌క భూమిక వ‌హించారు.

ఈజిప్టు, భూటాన్ , ర‌ష్యా, ప‌నామా, శ్రీ‌లంక‌, చిలీ త‌దిత‌ర 50 దేశాల‌కు చెందిన 800 నిపుణుల‌కు ట్రైనింగ్ ఇచ్చారు.ఐఐటీ చెన్నైలో ఇంగ్లీష్ బోధించ‌డంలో క‌థ‌లు చెప్పారు. 

టిస్ లో విజిటింగ్ ఫ్యాక‌ల్టీగా ఉన్నారు దీపా కిర‌ణ్ . రిసోర్స్ ప‌ర్స‌న్ గా ఉన్నారు ప‌లు సంస్థ‌ల‌కు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. మ‌రింత‌గా రాణించాల‌ని కోరుకుందాం.

Also Read : ‘ప్యూర్’ అవ‌గాహ‌న విద్యార్థినుల‌కు ఆలంబ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!