Sanju Samson Comment : హ్యాట్సాఫ్ శాంస‌న్ నిబ‌ద్ద‌త‌కు స‌లాం

అద్భుత‌ అవ‌కాశం కానీ దేశం ముఖ్యం

Sanju Samson Comment : కాసులు ఇస్తాం..కోరిన‌వ‌న్నీ ఏర్పాటు చేస్తామంటే ఎవ‌రైనా కాదనుకుంటారా. వెంట‌నే ఓకే చెప్పేస్తారు. సై అంటూ బ్యాగ్ స‌ర్దుకుంటారు. కానీ బంప‌ర్ ఆఫ‌ర్ ను వ‌ద్ద‌నుకున్నాడు.

ఖ‌రాఖండిగా చెప్పేశాడు నాకు కాసుల కంటే ఈ దేశం ముఖ్య‌మ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. ఆ అరుదైన ఆట‌గాడు ఎవ‌రో కాదు భార‌త క్రికెట్ జ‌ట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్న కేర‌ళ స్టార్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కెప్టెన్ సంజూ శాంస‌న్(Sanju Samson).

అత‌డు గత కొంత కాలం నుంచి జాతీయ జ‌ట్టులో చోటు కోసం నానా తంటాలు ప‌డుతున్నాడు. ఒక ర‌కంగా రాణిస్తూ వ‌చ్చినా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ప‌క్క‌న పెడుతూ వ‌స్తోంది. 

అడ‌పా ద‌డ‌పా ఎంపిక చేసినా కంటిన్యూగా ఆడించ‌లేక పోతోంది. స‌వాల‌క్ష రాజ‌కీయాలు ఈ ఎంపిక‌లో ప్ర‌భావితం చేస్తున్నాయి. అంత‌కంటే ఎక్కువ‌గా ఆట‌గాళ్ల జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నాయ‌డంలో సందేహం లేదు. 

వ‌రుస‌గా ఫెయిల్ అవుతూనే ఉన్నా రిష‌బ్ పంత్ ను ఎంపిక చేస్తూ త‌న ప‌క్ష‌పాత ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తోంది బీసీసీఐ. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా ట్రెండింగ్ లో ఉన్న ఏకైక క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. ఎక్క‌డా నోరు జార‌డం ఉండ‌దు. త‌న మానాన తాను ఆడుకుంటూ పోవ‌డ‌మే అత‌డు చేసిన నేరం.

విచిత్రం ఏమిటంటే ప్ర‌స్తుతం సంజూ శాంస‌న్ ఈ దేశంలో ఓ హీరో. యూత్ కు ఓ ఐకాన్ . ఈ న్యూజిలాండ్ లో బెంచ్ కే ప‌రిమిత‌మైనా..ఫ్యాన్స్ మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్నారు.

అత‌డి మేన‌రిజం, బ్యాటింగ్ అటాక్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఎంత వేగంగా వ‌చ్చిన బంతుల్ని అయినా స‌రే క‌ళ్లు చెదిరే లోపు సిక్స‌ర్ల‌ను అవ‌లీల‌గా కొట్ట‌డంలో శాంస‌న్ రాటు తేలాడు.

తాజాగా ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఏకంగా స్టార్ బ్యాట‌ర్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఎలాగూ బీసీసీఐ ఎంపిక చేయ‌డం లేదు కాబ‌ట్టి త‌మ దేశం నుంచి జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాల‌ని కోరింది. ఈ మేర‌కు స్వ‌త‌హాగా ఐసీబీ చీఫ్ ఫోన్ చేసి సంజూ శాంస‌న్(Sanju Samson) ను కోరాడు. 

దీనిని ధ్రువీక‌రించాడు సంజూ శాంస‌న్, కానీ శాంస‌న్ ఏం చేశాడంటే..సున్నితంగా త‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చిన ఐర్లాండ్ బోర్డు ను తిర‌స్క‌రించాడు. త‌న‌కు ఆట‌తో పాటు దేశం ముఖ్య‌మ‌ని స్ప‌ష్టంగా చెప్పేశాడు.

ఇంకా ఎంత కాల‌మైనా నిరీక్షిస్తాను కానీ నా ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన నా దేశాన్ని, నా ప్ర‌జ‌ల‌ను, నా అభిమానుల‌ను విడిచి ఎక్క‌డికీ వెళ్ల‌న‌ని ప్ర‌క‌టించాడు.

ఇప్పుడు మ‌రోసారి అంద‌నంత ఎత్తుకు ఎదిగి పోయాడు సంజూ శాంస‌న్. ఇవాళ జ‌ట్టులో ఉండొచ్చు లేదా ఉండ‌క పోవ‌చ్చు..కానీ ఇలాంటి నిబ‌ద్ద‌త 

క‌లిగిన ఆట‌గాళ్లు దేశానికి కావాలి. ఇలాంటి వాళ్ల‌నే జ‌నం కోరుకునేది. ఈ దేశం యువ‌తపై ఆధార‌ప‌డి ఉంది. 

ఆ యూత్ కు త‌న చేత‌లతో, ఆట తీరుతో, అసాధార‌ణ వ్యక్తిత్వంతో మ‌రోసారి గొప్ప క్రికెట‌ర్ అనిపించుకున్నాడు సంజూ శాంస‌న్. ఈ దేశం నీకు స‌లాం చేస్తుంది..ఎప్ప‌టికీ ఎల్ల‌ప్ప‌టికీ..

Also Read : రొనాల్డో ఆల్ టైం గ్రేట్ ప్లేయ‌ర్ – కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!