Mamata Banerjee : అమితాబ్ కు భారత రత్న ఇవ్వాలి – దీదీ
ఆయన దేశానికి గర్వ కారణం..సినీ దిగ్గజం
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) అమితాబ్ బచ్చన్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన లివింగ్ లెజెండ్ అని, నటనలో దిగ్గజమని, దేశానికి ఓ ఐకాన్ అని ప్రశంసలు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా సినీ రంగానికి చేస్తున్న సేవలకు గుర్తుగా అమితాబ్ బచ్చన్ కు భారత రత్న ఇవ్వాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
ఆయన గొప్ప వ్యక్తి. అంతే కాదు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇవాళ వయస్సు పెరిగినా ఇంకా తనదైన శైలిలో నటిస్తూనే ఉన్నారు. ప్రయోక్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అతని లాంటి ఆదర్శమైన వ్యక్తి సినీ రంగంలో లేరన్నారు సీఎం.
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఆయన చెప్పిన మాటలు నన్ను విస్తు పోయేలా చేశాయన్నారు దీదీ. భారత రత్న పురస్కారానికి అన్ని విధాలుగా అమితాబ్ బచ్చన్ అర్హుడంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బిగ్ బి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది.
ఇదే సమయంలో మనమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబురాలు చేసుకుంటున్నాం. కానీ ఇన్నేళ్లయినా దేశంలో పౌరుల హక్కులు, స్వేచ్ఛ గురించి ప్రశ్నలు లేవనెత్తడం బాధగా ఉందన్నారు నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన లేవనెత్తిన భావ ప్రకటనా స్వేచ్చ గురించి కీలక వ్యాఖ్యలు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం.
ఇదిలా ఉండగా కోల్ కతా నా స్వంత ఇల్లు అని. తాను ఎల్లప్పుడూ కోల్ కతాకు అల్లుడిగా ఉంటానని అన్నారు.
Also Read : రాహుల్ యాత్రలో ఆనంద్ పట్వర్ధన్