Ghulam Nabi Azad Announces : ఆజాద్ పార్టీ కార్యవర్గం రిలీజ్
ప్రకటించిన గులాం నబీ ఆజాద్
Ghulam Nabi Azad Announces : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన గులాం నబీ ఆజాద్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన జమ్మూ , కాశ్మీర్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 73 ఏళ్ల వయస్సు కలిగిన ఆజాద్ గత సెప్టెంబర్ 26న జమ్మూ లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ)ని ఏర్పాటు చేశారు.
ఈ మేరకు తాజాగా ముగ్గురికి కీలక పదవులు కేటాయించారు. వారిని ఉపాధ్యక్షులుగా నియమించారు. అధికారికంగా వారి పేర్లను వెల్లడించారు. ఈ ముగ్గురు మాజీ మంత్రులు కావడం విశేషం. మరో వైపు వ్యవస్థాపక సభ్యుల సెషన్ లో డీఏపీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తన పార్టీని ప్రారంభించిన మూడు నెలల తర్వాత డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ ఈ కీలక ప్రకటన చేశారు. మాజీ మంత్రులు తారా చంద్, పీర్జాద్ మొహమ్మద్ సాయిద్, జీఎం సరూరిలను పార్టీ వైస్ చైర్మన్ లుగా నియమించారు. అంతే కాకుండా మరో కీలక పదవి కట్టబెట్టారు సల్మాన్ నజామీకి. ఆయనను డీఏంపీ ముఖ్య అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు గులాం నబీ ఆజాద్.
ఇక జమ్మూ , కాశ్మీర్ ప్రాంతాలకు జుగల్ కిషోర్ శఱ్మ, మొహమ్మద్ అమీన్ భట్ లను ప్రాంతీయ అధ్యక్షులుగా నియమించారు. 10 మంది కొత్త ప్రధాన కార్యదరర్శులు, 12 మంది కార్యదర్శులు, ఆరుగు అధికార ప్రతినిధులు, మీడియా కోఆర్డినేట్లరు, అదనపు అధికార ప్రతినిధులు , నలుగురు సోషల్ మీడియా కోఆర్డినేటర్ల పేర్లను కూడా ప్రకటించింది.
Also Read : పాదయాత్ర చేస్తే ప్రజల మద్దతు రాదు