Lionel Messi : ఇది అర్జెంటీనా ప్రజలందరి కల – మెస్సీ
ఇన్ స్టా గ్రామ్ లో భావోద్వేగ పూరితమైన పోస్ట్
Lionel Messi : నెట్టింట్లోనే కాదు యావత్ ప్రపంచమంతా ఒకే ఒక్కడి పేరు జపిస్తోంది అదే అర్జెంటీనా ఫుట్ బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ. అతడి సారథ్యంలో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022ను కైవసం చేసుకుంది. ఫ్రాన్స్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం తన జట్టు సహచరులతో ఆనందాన్ని పంచుకున్నాడు మెస్సీ.
తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది నా ఒక్కడి కల మాత్రమే కాదు. ఎంతో కాలంగా ఫిఫా వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటూ వచ్చామని పేర్కొన్నాడు. కానీ ఆ స్వప్నం ఈ ఏడాది ఆచరణ సాధ్యమైందని స్పష్టం చేశాడు. ప్రపంచ కప్ గెలవాలని నాతో పాటు నా దేశానికి చెందిన ప్రతి ఒక్కరు కోరుకున్నారు.
వారందరి కలలు ఫలించాయి. నా దేశం పతాకం సగర్వంగా ఇవాళ ఎగురుతోంది. విశ్వ విజేతగా నిలిచేందుకు మేం సాగించిన ఈ ప్రయాణం ఎల్లప్పటికీ నిలిచి ఉంటుందని పేర్కొన్నాడు మెస్సీ(Lionel Messi). నా సుదీర్ఘ లక్ష్యం ఒక్కటే ఫిఫా వరల్డ్ కప్ అందుకోవడం. ఇక ఈ జీవితానికి ఇంతకంటే గొప్ప జ్ఞాపకం ఏముంటుందని అన్నాడు. 2014లో జర్మనీతో జరిగిన ఫైనల్ లో గుండె పోటు వచ్చిందని తెలిపాడు మెస్సీ.
ఈ జర్నీలో నాకు సహకరించిన అభిమానులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు. నేను చాలా సార్లు కోరుకున్నాను. ఇవాళ మేం ఛాంపియన్లమని అనుకుంటే నమ్మలేక పోతున్నానని అన్నాడు. నా కుటుంబ సభ్యులకు, నన్ను ఆదరిస్తున్న వారందరికీ, నమ్మని వారికీ థ్యాంక్స్ అన్నాడు. ఐక్యంగా కలిసి కట్టుగా ఆడితే అనుకున్నది సాధించగలమని ఇవాళ నిరూపించామని స్పష్టం చేశాడు మెస్సీ.
Also Read : ఆట అంటే దేశ పతాకం ఆత్మ గౌరవం