Jaya Kishori Journey : ఆధ్యాత్మిక ప్రయాణం ఆనంద సమీరం
సానుకూల దృక్పథంతో జయా కిషోరీ జర్నీ
Jaya Kishori Journey : ఎవరీ జయ కిషోరి అనుకుంటున్నారా. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆమె ఓ ధృవతార. ఎలాంటి భేషజాలు లేకుండా జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో వివరిస్తారు. చిన్న తనం నుంచే ఆధ్యాత్మిక భావ జలధారను పుణికి పుచ్చుకున్న జయ కిషోరి ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ గా ఎదిగారు.
ఒక రకంగా తనను తాను మలుచుకున్నారు. తీవ్ర నిరాశలో ఉన్న వారికి ఆమె ఓ స్వాంతన. బాధల్లో ఉన్న వారికి ఓ ఆలంబనగా నిలుస్తున్నారు. చెరగని చిరునవ్వుతో ఎలాంటి క్లిష్టమైన సమస్యలనైనా సులువుగా ఎలా గట్టెక్కాలో చెబుతారు. భారత దేశ సంస్కృతికి మూలమైన ఇతిహాసాలను సోదాహరణంగా వివరిస్తారు.
జయ కిషోరి(Jaya Kishori) సానుకూల దృక్ఫథాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. దానినే ఆమె ఆయుధంగా చేసుకున్నారు. భక్తురాలిగా, యోగిగా, ఆధ్యాత్మిక గురుణిగా పేరొందారు. అంతే కాదు భజన్స్ , భక్తి గీతాలు కూడా ఆలాపిస్తారు.
సోషల్ మీడియాలో ఆమె మోస్ట్ పాపులర్. మోస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా పేరొందిన మనీష్ మహేశ్వరి కూడా జయా కిషోరిని చూసి తాను విస్తు పోయానని పేర్కొనడం ఆమె సాధించిన విజయానికి ఓ తార్కాణం అని చెప్పక తప్పదు.
ప్రవచనాలు వల్లించడం చేస్తే ఏమవుతుంది. కొద్ది సేపు వింటారు. కానీ ఆ తర్వాత మరిచి పోతారు. కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలంటారు. పిల్లలు ఎదగడానికి, నేర్చుకునేందుకు కేవలం తల్లిదండ్రులతోనే సాధ్యమవుతుందంటారు. అందుకే పేరెంట్స్ కు వ్యక్తిత్వ వికాసం అన్నది తప్పని అవసరం అంటారు జయా కిషోరి.
ఆమె ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. నీతి కథలను ఉదహరిస్తారు. విలువలను బోధిస్తారు. పెద్దల్ని గౌరవించాలని సూచిస్తారు. తను పెరిగిన కుటుంబ వాతావరణం ఆమెను బోధకురాలిగా మార్చేసింది.
ఇదే ఆధ్యాత్మికత పట్ల ఉత్సుకత, ప్రేమను రేకెత్తించింది. ఆధ్యాత్మిక వక్తగా, ప్రేరణాత్మక శిక్షకురాలిగా మార్చేందుకు ప్రేరేపించింది.
అందరూ సరైన మార్గంలో ప్రయాణం చేసేందుకు తను ప్రయత్నం చేస్తున్నారు. సానుకూల వాతావరణం, ఆలోచనా విధానం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు జయా కిషోరి. ఆమె ప్రధానంగా కుటుంబం ప్రాముఖ్యతను వివరిస్తారు. దాని గొప్పతనాన్ని చెబుతారు.
ఇదే పిల్లలను గొప్ప వారిగా చేస్తుందని అంటారు. జీవితంలో రాణించాలంటే సహనం, స్థిరత్వం , ప్రశాంతమైన మానసిక స్థితి అవసరం అంటారు జయా కిషోరి. ఆమె ఎక్కువగా భగవత్ గీత, జీవితంలోని అనుభవాలు, కుటుంబ బోధనలు , అందరి నుండి జ్ఞానాన్ని పొందిన వాటిని ప్రస్తావిస్తారు.
ప్రపంచాన్ని ఎదుర్కోవడంలో , అవసరమైన జ్ఞానాన్ని పొందడంలో జయ కిషోరి(Jaya Kishori) ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమెను గొప్ప బోధకురాలిగా మార్చేలా చేసిందనడంలో సందేహం లేదు.
ఆమెను ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. కానీ వాటిని ఏవీ గుర్తించరు. జీవితం అందమైనది. దానిని ఆస్వాదించండి. ఆనందం పొందండి అంటారు. ఇంకెందుకు ఆలస్యం జయా కిషోర్ ను వీలైతే కలుద్దాం.
Also Read : పోటెత్తిన భక్తులు దర్శనానికి తిప్పలు