IPL Auction 2023 : సర్వం సన్నద్ధం వేలం పాటకు సిద్దం
87 స్లాట్స్ 405 మంది ప్లేయర్ల పోటీ
IPL Auction 2023 : ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కు సంబంధించి నిర్వహించే మినీ వేలం పాటపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వరల్డ్ క్రికెట్ లో అత్యంత జనాదరణ కలిగిన ఏకైక టోర్నీ ఇదే కావడం. కోట్లాది రూపాయలు దిగ్గజ కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే వేల కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఒక్కో మ్యాచ్ ధర దాదాపు రూ. 200 కోట్లకు పైమాటేనని అంచనా. ఇది మామూలు వ్యాపారం కాదు. ఇక ఐపీఎల్ లో ఆడే భారత ఆటగాళ్లు ఇతర లీగ్ లలో ఆడకూడదు. కానీ విదేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ టోర్నీలో పాలు పంచుకునేందుకు వీలుంటుంది.
ఇది మొదటి నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుసరిస్తున్న విధానం. వచ్చే ఏడాది 2023లో నిర్వహించే ఐపీఎల్ లీగ్ కోసం ప్రస్తుతం వేలం పాట చెపట్టేందుకు రెడీ అయ్యింది ఐపీఎల్ ప్యానల్. ఈ మేరకు గతంలో బెంగళూరులో నిర్వహించగా ఈసారి డిసెంబర్ 23 శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముహూర్తం నిర్ణయించింది బీసీసీఐ.
కేరళ లోని కొచ్చిలో ఐపీఎల్ వేలం(IPL Auction 2023) చేపట్టనుంది. మొత్తం 87 స్లాట్స్ కు గాను 405 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. అయితే 925 మందికి పైగా ప్రపంచ వ్యాప్తంగా ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ బీసీసీఐ కేవలం 405 మందిని మాత్రమే ఎంపిక చేసింది. ఇక ఫ్రాంచైజీల పరంగా చూస్తే కావ్య మారన్ సిఇఓగా ఉన్న సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ వద్దే అత్యధికంగా మనీ ఉండడం విశేషం.
Also Read : ప్రపంచ ర్యాంకింగ్స్ లో మెస్సీ సేన