IPL Mini Auction 2023 : ఐపీఎల్ లో 87 స్లాట్స్ 405 ప్లేయర్లు
పోటీ పడనున్న 10 ఫ్రాంచైజీలు
IPL Mini Auction 2023 : కేరళలోని కొచ్చిలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కు సంబంధించి మినీ వేలం పాట శుక్రవారం కొనసాగుతుంది. ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. యావత్ క్రికెట్ లోకం ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. విదేశీ ఆటగాళ్లతో పాటు దేశానికి చెందిన భారత ఆటగాళ్లు వేలం పాటలోకి రానున్నారు.
మొత్తం 10 ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. మిగతా వారిని విడుదల చేశాయి. మొత్తం 87 స్లాట్స్ కు సంబంధించి 405 మంది ఆటగాళ్లు వేలం పాటకు(IPL Mini Auction 2023) రానున్నారు. ఐపీఎల్ 2008 నుంచి కొనసాగుతోంది. దీనికి ముందుగా శ్రీకారం చుట్టింది మాత్రం లలిత్ మోదీ.
ఇప్పటికే ఆయా జట్లు 163 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఇంకా 87 స్లాట్స్ కోసం పోటీ పడనున్నాయి ఫ్రాంచైజీలు. ఇక ఐపీఎల్ టెలికాస్ట్ కు సంబంధించి భారీ ఎత్తున విక్రయించింది బీసీసీఐ. కొచ్చి లోని గ్రాండ్ హయత్ హోటల్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం పాట కొనసాగుతుంది.
ఇక మినీ వేలం పాటను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో టెలికాస్ట్ కానుంది. దీంతో పాటు రిలయన్స్ జియో సినిమా యాప్ లో కూడా లభ్యమవుతుంది. ఇక ఫ్రాంచైజీల పరంగా చూస్తే ముంబై ఇండియన్స్ వద్ద రూ. 20. 45 కోట్లు ఉన్నాయి. 7 స్లాట్స్ ఉండగా ఇందులో రెండు స్థానాలు విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించింది.
రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 13.2 కోట్లు ఉన్నాయి. 9 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. నాలుగు స్థానాలు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ. 23.35 కోట్లు ఉండగా 10 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ వద్ద రూ. 8.75 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 19.25 కోట్లు ఉండగా 7 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.
కోల్ కతా నైట్ రైడర్స్ వద్ద రూ. 7.05 కోట్లు ఉన్నాయి. ఇందులో 11 స్లాట్స్ ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ వద్ద రూ. 32.2 కోట్లు ఉన్నాయి. 9 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. సన్ రైజర్స్ వద్ద రూ. 42.25 కోట్లు ఉన్నాయి. 13 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. మిగతా వాటికి ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.
Also Read : సర్వం సన్నద్ధం వేలం పాటకు సిద్దం