Kavya Maran : మళ్లీ మెరిసిన కావ్య మార‌న్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Kavya Maran : మ‌రోసారి మెరిసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిఇఓ కావ్య మార‌న్(Kavya Maran). ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2023కి సంబంధించి కేర‌ళ లోని కొచ్చిలో కొన‌సాగిన వేలం పాట‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. ఆమె ఎప్పుడైతే ఎస్ఆర్ హెచ్ ను టేకోవ‌ర్ చేసుకుందో ఆనాటి నుంచి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

ఆమె హావ భావాలతో పాటు వేలం పాల్గొంటున్న దానిని సైతం ఫోటోలు, వీడియోలతో హోరెత్తిస్తున్నారు. ఇప్ప‌టికే ఐపీఎల్ లో ఉన్న ఫ్రాంచైజీల‌లో పంజాబ్ కింగ్స్ కు ప్ర‌ముఖ న‌టి ప్రీతి జింతా ఉండ‌గా ముంబై ఇండియ‌న్స్ కు నీతా అంబానీ, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు న‌టి జూహీ చావ్లా ఉన్నారు.

కానీ వీళ్లకు రానంత ప్ర‌చారం ఒక్క కావ్య మార‌న్ కే(Kavya Maran) వ‌చ్చింది. మీడియా మొఘ‌ల్ గా పేరొందిన ద‌యానిధి మార‌న్ వార‌స‌త్వానికి రారాణిగా ఉన్నారు ఆమె. ఇక ఐపీఎల్ వేలం పాట జ‌రిగిన ప్ర‌తీసారి ట్రెండింగ్ లో కొన‌సాగుతూ వ‌స్తున్నారు కావ్య మార‌న్. ఇక వ‌చ్చే ఏడాది 2023లో జ‌రిగే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న జాబితాలను విడుద‌ల చేశాయి.

ఆ మొత్తం పూర్తి అయ్యాక 87 స్లాట్స్ మిగిలాయి. ఇక ఫ్రాంచైజీల‌లో అత్య‌ధిక ప‌ర్స్ (డ‌బ్బులు ) ఉన్న‌ది మాత్రం కావ్య మార‌న్ సిఇఓగా ఉన్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ద్దే ఉండ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు సామ్ క‌ర‌న్ రూ. 18.5 కోట్ల‌కు అమ్ముడు పోగా కామెరూన్ 17 కోట్ల‌కు అమ్ముడు పోయాడు ముంబై ఇండియ‌న్స్ కు. ఇక 13 కోట్ల‌కు ఇంగ్లండ్ ఆట‌గాడిని తీసుకుంది ఎస్ఆర్హెచ్.

Also Read : సామ్ క‌ర‌న్ ఐపీఎల్ వేలంలో క‌మాల్

Kavya Maran Viral : కావ్య మార‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్

Leave A Reply

Your Email Id will not be published!