DC IPL 2023 Auction : దమ్మున్న ఆటగాళ్లతో ఢిల్లీ క్యాపిటల్స్
ప్రధాన ఆటగాళ్లకు ప్రయారిటీ
DC IPL 2023 Auction : ఈసారి ఎలాగైనా ఐపీఎల్ 2023 ఛాంపియన్ కావాలని డిసైడ్ అయ్యింది రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్. కేరళ లోని కొచ్చిలో జరిగిన మినీ వేలం పాటలో దమ్మున్న ఆటగాళ్లను ఈసారి ఏరి కోరి ఎంపిక చేసుకుంది యాజమాన్యం.
ఈసారి జరిగిన ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్(DC IPL 2023 Auction) ఐదవ స్థానంలో నిలిచింది. కొత్త ఆటగాళ్లపై ఫోకస్ పెట్టింది. వారిని తీసుకునేందుకు ప్రయారిటీ ఇచ్చింది. ఐదుగురు ఆటగగాళ్లను తొలగించింది మొత్తం 20 మంది ప్లేయర్లతో సరి పెట్టుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఊహించని రీతిలో ముఖేష్ కుమార్ ను ఏకంగా రూ. 5.50 కోట్లకు కొనుగోలు చేయడం విస్తు పోయేలా చేసింది. ముఖేష్ కూడా ఊహించ లేదు ఈ ఆఫర్ కు తాను అమ్ముడు పోతానని. ఆ తర్వాత రైలీ రస్సో రూ. 4.60 కోట్లకు తీసుకుంది.
మనీష్ పాండేను రూ. 2.40 కోట్లకు చేజిక్కించుకుంది. ఇషాంత్ శర్మ్ ను రూ. 50 లక్షలకు , ఫిల్ సాల్ట్ ను రూ. 2 కోట్లకు కైవసం చేసుకుంది. ఇక శార్దూల్ ఠాకూర్ , హెబ్బార్ , శ్రీకర్ భరత్ , సీఫెర్ట్ , మన్ దీప్ సింగ్ ను విడుదల చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ .
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో విక్కీ ఓస్త్వాల్ , ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్ , రహ్మాన్ అంగిజ్డి, లుంగీ ఖాన్ , ఖలీల్ అహ్మద్ , కమలేష్ నాగర్ కోటి, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్కియా, అక్షర్ పటేల్ , లలిత్ యాద్ , మిచెల్ మార్ష్ , యశ్ ధుల్ , సర్ఫరాజ్ అహ్మద్ , రోవ్ మన్ పావెల్, రిప్పల్ పటేల్ , పృథ్వీ షా , డేవిడ్ వార్నర్ , రిషబ్ పంత్ ఉన్నారు.
Also Read : దేశీ ఆటగాళ్లకే కోల్ కతా ప్రయారిటీ
Kavya Maran Comment : కావ్య మారన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్