CSK IPL 2023 Auction : మినీ వేలం పాటలో ‘డైనమిక్’ మార్క్
సీనియర్లు..జూనియర్లతో సీఎస్కే
CSK IPL 2023 Auction : ఐపీఎల్ లో టాప్ ఫెవరేట్ టీమ్ ఏదైనా ఉందంటే అది ఝార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. కొచ్చిలో జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం(CSK IPL 2023 Auction) పాటలో సీనియర్లతో పాటు జూనియర్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఈ మొత్తం ఎంపికలో ధోనీ మార్క్ కనిపించింది. ఆ జట్టు యాజమాన్యం పూర్తిగా కెప్టెన్ పైనే నమ్ముకుంది.
ఈసారి ఐపీఎల్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాను జట్టు నాయకత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ధోనీ. రవీంద్ర జడేజాకు అప్పగించింది మేనేజ్ మెంట్. జట్టు ఆశించిన మేర రాణించ లేదు. దీంతో తిరిగి జార్ఖండ్ డైనమెట్ కే ఛాన్స్ ఇచ్చింది.
ఇక మినీ వేలం పాటకు ముందు ఎన్. జగదీషన్ , ఆసిఫ్ , భగత్ వర్మ, జోర్డాన్ , నిశాంత్ , మిలనె, రాబిన్ ఊతప్ప, బ్రేవోను విడుదల చేసింది.
ఇదిలా ఉండగా ఐపీఎల్ ఆక్షన్ లో అజయ్ మండల్ , భగత్ వర్మ, కైలీ జామిసన్ , నిశాంత్ సింధు, బెన్ స్టోక్్ , షేక్ రషీద్ , అజింక్యా రహానేను కొనుగోలు చేసింది. ఇక అజింక్యా రహానేను కోల్ కోత్ నైట్ రైడర్స్ వదులుకుంది.
ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో సోలంకి, తీక్షనా , దీపక్ చాహర్ , సిమర్జీట్ సింగ్ , పాతిరానా, ముఖేశ్ చౌదరి, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా, శాంట్నార్ , ప్రిటోరియస్ , హంగర్గేకర్ , శివం దూబే, మొయిన్ అలీ, సేనా పతి, రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ , కాన్వే , ఎంఎస్ ధోనీ ఉన్నారు.
Also Read : స్టార్ ఆటగాళ్లపై ‘గుజరాత్’ గురి