LSG IPL 2023 Auction : గెలుపు గుర్రాలపై లక్నో నజర్
ప్రధాన ఆటగాళ్ల పైనే బిగ్ ఫోకస్
LSG IPL 2023 Auction : కొచ్చిలో ఐపీఎల్ 2023 మినీ వేలం పాట ముగిసింది. ఆయా జట్లన్నీ ఎక్కువగా ఆల్ రౌండర్లు, బౌలర్లు, బ్యాటర్లపై ఫోకస్ పెట్టాయి. కానీ లక్నో సూపర్ జెయింట్స్(LSG IPL 2023 Auction) గెలుపు గుర్రాలపైనే ఎక్కువగా నజర్ పెట్టింది. కేఎల్ రాహుల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
ఈసారి జరిగిన ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ చేరింది. ప్రారంభ సీజన్ లోనే ప్లే ఆఫ్స్ కు చేరింది. కానీ గుజరాత్ చేతిలో లక్నో ఓటమి పాలైంది. ఈ జట్టుకు మెంటార్ గా ఉన్నాడు గౌతమ్ గంభీర్.
వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఆండ్రూ టై, అంకిత్ రాజ్ పుత్ , దుష్మంత చమీరా, లూయిస్ , జేసన్ హోల్డర్ , మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ ను విడుదల చేసింది.
ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ , బడోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా , క్వింటన్ డికాక్ , మార్కస్ స్టోయినిస్ , కృష్ణప్ప గౌతమ్ , దీపక్ హూడా, కైల్ మేయర్స్ , కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్ , మోహిసిన్ ఖాన్ , మార్క్ వుడ్ , మయాంక్ యాదవ్ , రవి బిష్ణోయ్ ఉన్నారు.
తాజా వేలం పాటలో మొత్తం 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్ . మొత్తం రూ. 23.35 కోట్ల పర్స్ తో రంగంలోకి దిగారు. నలుగురు విదేశీ ప్లేయర్లను ఆరుగురు దేశీయ ఆటగాళ్లను చేజిక్కించుకుంది.
వీరిలో నికోలస్ పూరన్ , రొమారియో, షెపర్డ్ , డేనియల్ సామ్స్ , నవీన్ ఉల్ హక్ ఉన్నారు. ఇక పూరన్ ను ఏకంగా రూ. 16 కోట్లకు తీసుకుంది. రొమారియో , సామ్స్ లను రూ. 50 లక్షలు, రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక నవీన్ ఉల్ హక్, ఉనాద్కత్ , అమిత్ మిశ్రాలను రూ. 50 లక్షలకు తీసుకుంది. మొత్తంగా లక్నో టాప్ ప్రయారిటీ ఇచ్చింది.
Also Read : పంజాబ్ కింగ్స్ ఫుల్ జోష్