Venugopal Dhoot Bail : వీడియోకాన్ గ్రూప్ మాజీ చీఫ్ కు బెయిల్
మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు
Venugopal Dhoot Bail : రుణం మోసం కేసులో ప్రముఖ సంస్థ వీడియోకాన్ గ్రూప్ కు చెందిన మాజీ చైర్మన్ , ఎండీ వేణుగోపాల్ ధూత్ కు ఊరట లభించింది.
ఈ మేరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. వేణుగోపాల్ ధూత్ ను గత నెలలో అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఐసీఐసీఐ బ్యాంక్ – వీడియోకాన్ రుణ మోసం కేసును నమోదు చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).
అరెస్ట్ చేసిన సీబీఐ వీడియోకాన్ మాజీ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ను సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా రుణ మోసం కేసులో గత నెలలో సీబీఐ అరెస్ట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ కు బాంబే హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్(Venugopal Dhoot Bail) మంజూరు చేసింది. జనవరి 5న ప్రత్యేక సీబీఐ కోర్టు తన అభ్యర్థనను తిరస్కరించడంతో వేణుగోపాల్ ధూత్ హైకోర్టును ఆశ్రయించారు.
డిసెంబర్ 26న తనను అరెస్ట్ చేయడం చట్ట విరుద్దమని పేర్కొన్నాడు. అందుకే మధ్యంతర విడుదల చేయాలని కోరారు వేణుగోపాల్ ధూత్. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న చందా కొచ్చర్ , ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సిఈవో , ఆమె భర్త దీపక్ కొచ్చర్ లకు ఈనెల మొదటి వారంలో జరిగిన విచారణలో బెయిల్ లభించింది.
దీంతో వీరికి బెయిల్ లభించడంతో తనకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరారు. కోర్టుకు ఎక్కారు వేణుగోపాల్ ధూత్. డిసెంబర్ 24న కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసింది.
Also Read : కాలర్ పేరు తప్పనిసరి కాదు