Rakesh Tikait Wrestlers : రెజ్లర్ల ఆందళన టికాయత్ ఆవేదన
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ పై చర్య తీసుకోవాలి
Rakesh Tikait Wrestlers : రైతు అగ్ర నాయకుడు రాకేశ్ టికాయత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్న మహిళా రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు.
ట్విట్టర్ వేదికగా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దేశానికి తమ ప్రతిభా పాటవాలతో పేరు తీసుకు వస్తున్న మహిళా మల్ల యోధుల పట్ల ఇలాంటి వివక్ష, లైంగిక ఆరోపణలు దారుణమని పేర్కొన్నారు. వెంటనే ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనాన్ని వీడాలని, తమ పార్టీకి చెందిన భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై నిస్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలని సూచించారు.
రిటైర్డ్ జడ్జితో విచారణ చేపడితే కీలకమైన విషయాలు బయట పడతాయని అన్నారు రైతు నాయకుడు రాకేశ్ టికాయత్(Rakesh Tikait). భారత ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి మహిళా మల్ల యోధులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం రెజ్లింగ్ లోనే కాకుండా ఇతర క్రీడా రంగాలలో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మహిళ అథ్లెట్లు, క్రీడాకారులకు సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు రైతు అగ్ర నాయకుడు రాకేశ్ టికాయత్.
ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి పతకాలు తీసుకు వచ్చిన అథ్లెట్లు ఇవాళ తమకు అన్యాయం జరిగిందని దేశ రాజధానిలో ధర్నాకు దిగడం ఆవేదన కలిగిస్తోందన్నారు రాకేశ్ టికాయత్.
Also Read : మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై ఫిర్యాదు