IND vs NZ 2nd ODI : కీవీస్ గెలిచేనా భారత్ నిలిచేనా
సీరీస్ పై కన్నేసిన టీమిండియా
IND vs NZ 2nd ODI : భారత న్యూజిలాండ్ జట్ల మధ్య కీలకమైన రెండో వన్డే మ్యాచ్ శనివారం రాయ్ పూర్ లో జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఏకంగా 208 పరుగులు చేసి సత్తా చాటాడు.
అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఊహించని రీతిలో సత్తా చాటింది. ఎవరూ ఊహించని రీతిలో భారత బౌలర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఒకానొక దశలో 131 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మైఖేల్ బ్రేస్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 78 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బ్రేస్ వెల్ 12 ఫోర్లు 10 సిక్సర్లతో రెచ్చి పోయాడు.
మహ్మద్ సిరాజ్, మహమ్మద్ షఫీ రాణించినా మిగతా బౌలర్లు తేలి పోయారు. ఇవాళ జరిగే కీలక పోరులో గెలిస్తే భారత్(IND vs NZ 2nd ODI ) సీరీస్ వశమవుతుంది. లేకుంటే మూడో మ్యాచ్ లో నువ్వా నేనా అని తేల్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు గెలుస్తామా లేదా అన్నంత టెన్షన్ తీసుకు వచ్చారు కీవీస్ ఆటగాళ్లు. ఇప్పటికే రాయ్ పూర్ స్టేడియంలో టికెట్లు ఫుల్ అయి పోయాయి.
ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. ఆట ప్రారంభం అయితే కానీ ఎవరు గెలుస్తారో చెప్పలేం. మొత్తంగా ఫ్యాన్స్ కు అసలైన క్రికెట్ లో ఉన్న మజా ఏమిటో రుచి చూసే ఛాన్స్ ఉంది.
Also Read : రెండో వన్డేలో కీలక మార్పులు