Rahul Yatra Tight Security : రాహుల్ యాత్ర‌కు భారీ భ‌ద్ర‌త

జ‌మ్మూ కాశ్మీర్ లో వ‌రుస ఘ‌ట‌న‌లు

Rahul Yatra Tight Security : జ‌మ్మూ కాశ్మీర్ లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఓ వైపు ఉగ్ర మూక‌లు జ‌మ్మూ లోని న‌ర్వాల్ లో జంట పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు గాయప‌డ్డారు. దీంతో మ‌రింత అల‌ర్ట్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జ‌మ్మూ కాశ్మీర్ లో కొన‌సాగుతోంది.

భారీ ఎత్తున జ‌నం ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా పాల్గొంటున్నారు. ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టికే రాహుల్ గాంధీకి స‌మాచారం అందించారు. ఆయ‌నకు సెక్యూరిటీని మ‌రింత పెంచారు(Rahul Yatra Tight Security). ఎక్క‌డిక‌క్క‌డ బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. భ‌ద్ర‌త విష‌యంపై రాష్ట్ర లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తో స‌మీక్షించారు.

ఇదిలా ఉండ‌గా రాహుల్ చేప‌ట్టిన పాద‌యాత్ర 129వ రోజుకు చేరుకుంది. సోమ‌వారం ఉద‌యం జ‌మ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో విజయ్ పూర్ నుండి తిరిగి ప్రారంభ‌మైంది. భ‌ద్ర‌తా సంస్థ‌లు ప‌ర్య‌వేక్ష‌ణ ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేశాయి. ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేలా బ‌హుళ లేయ‌ర్డ్ వ్య‌వ‌స్థ‌ను ఉంచారు.

ఇప్ప‌టికే నిఘా విభాగాలు రాహుల్ గాంధీకి త‌న చుట్టూ ఉన్న త‌న స‌న్నిహిత వర్గాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే వ్య‌క్తుల‌ను ఉంచాల‌ని స‌ల‌హా ఇచ్చాయి. ఈ ప్రాంతంలో మోహించిన సీఆర్పీఎఫ్ , జ‌మ్మూ కాశ్మీర్ పోలీసుల సంఖ్య‌ను కూడా పెంచామ‌ని, సున్నిత‌మైన ప్రాంతాల‌పై నిఘా ఉంచేందుకు డ్రోన్ ల‌ను ఉప‌యోగిస్తామ‌ని పోలీసు ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

మొత్తంగా రాహుల్ గాంధీ చేప‌ట్టిన యాత్ర జ‌న‌వ‌రి 31న ముగుస్తుంది. అంత వ‌ర‌కు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు కంటి మీద కునుకు అంటూ ఉండ‌దు.

Also Read : నేతాజీ జీవితం స్పూర్తిదాయ‌కం – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!