Rahul Gandhi Netaji : నేతాజీ జీవితం స్పూర్తిదాయ‌కం – రాహుల్

కోట్లాది మందికి ఆయ‌న ప్రేర‌ణ‌

Rahul Gandhi Netaji : నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ప్ర‌ద‌ర్శించిన ధైర్య సాహ‌సాలు నేటికీ స్పూర్తిని క‌లిగిస్తూనే ఉంటాయ‌ని అన్నారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ. దేశ స్వాతంత్ర ఉద్య‌మ కాలంలో నేతాజీ పోషించిన పాత్ర గొప్ప‌ద‌ని కొనియాడారు. జ‌న‌వ‌రి 23 దేశ వ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జ‌యంతిని జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ నేతాజీకి(Rahul Gandhi Netaji) నివాళులు అర్పించారు.

నేతాజీ ధైర్య సాహ‌సాలు మ‌న స్వేచ్ఛ‌ను కాపాడు కునేందుకు భార‌తీయుల‌కు స్పూర్తిగా నిలిచింద‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. తుమ్ ముఝే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దుంగా అనే నినాదం కోట్లాది భార‌తీయుల‌ను క‌దిలించింద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు కాంగ్రెస్ అగ్ర నేత‌.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ధైర్యం, సాహసం, దేశ భ‌క్తి నేటికీ స్పూర్తిని క‌లిగిస్తూనే ఉంద‌ని కొనియాడారు రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ పార్టీ కూడా నేతాజీకి ఘ‌నంగా నివాళులు అర్పించింది. రాహుల్ గాంధీతో పాటు పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు కేసీ వేణు గోపాల్ , జైరాం ర‌మేష్ సైతం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు నివాళులు అర్పించారు. నేతాజీ దేశానికి చేసిన సేవ‌ను కొనియాడారు.

ఆయ‌న ఇవాళ భౌతికంగా లేక పోయినా జీవితాంతం నిలిచే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. నేటి యువ‌త నేతాజీ జీవితాన్ని అర్థం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఆయ‌నలోని ధైర్యం త‌న‌కు ఎంత‌గానో న‌చ్చింద‌ని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ.

Also Read : మోడీజీ లడ‌ఖ్ ను ర‌క్షించండి

Leave A Reply

Your Email Id will not be published!