Rahul Dravid : శాంస‌న్ ఓకే కానీ ధోనీ లాంటోడు కావాలి

కీపింగ్ ..బ్యాట‌ర్ పై ఎక్కువ‌గా ఫోక‌స్

Rahul Dravid : భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కీల‌క కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ తో సీరీస్ కొన‌సాగుతోంది. త్వ‌ర‌లో ఆసిస్ భార‌త్ లో ప‌ర్య‌టించ‌నుంది. ఇప్పటికే బీసీసీఐ కీల‌క మార్పులు చేస్తూ వ‌స్తోంది. ప్ర‌ధానంగా సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ రెండోసారి ఎన్నిక‌య్యాక మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు.

ప్ర‌స్తుతం జ‌ట్టు బాగానే ఉన్నా ఇంకా నిల‌క‌డ‌గా ఆడ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు. త్వ‌ర‌లోనే భార‌త్ లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇందుకు భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది. మ‌రో వైపు సెలెక్ష‌న్ క‌మిటీ 20 మందితో కూడిన జ‌ట్టును ఎంపిక చేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వారి వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు.

కీల‌క‌మైన ఆటగాళ్లు రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డితే, ఫీల్డింగ్ స‌మ‌యంలో సంజూ శాంస‌న్ గాయ‌ప‌డి చికిత్స పొందుతున్నాడు. ఈ త‌రుణంలో రాబోయే జ‌ట్టులో ఎలాంటి మార్పులు ఉండాల‌నే దానిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid). వికెట్ కీపింగ్ ప‌రంగా కేఎల్ రాహుల్ , రిష‌బ్ పంత్ , సంజూ శాంస‌న్ , ఇషాన్ కిష‌న్ , కేఎస్ భ‌ర‌త్ తో పాటు మ‌రికొంద‌రిపై ఫోక‌స్ పెట్టామ‌ని చెప్పారు.

అయితే జ‌ట్టులో మ‌హేంద్ర సింగ్ ధోనీ లాగా అటు వికెట్ కీపింగ్ ఇటు బ్యాటింగ్ చేసే ఆట‌గాడు కావాల‌ని స్ప‌ష్టం చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ లో ప్ర‌ధానంగా 50 ఓవ‌ర్ల వ‌ర‌కు ఓపిక‌తో కీపింగ్ చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ర‌న్స్ చేస్తే బెట‌ర్ అని పేర్కొన్నాడు.

Also Read : టీమిండియా జోరుకు కీవీస్ బ్రేక్ వేసేనా

Leave A Reply

Your Email Id will not be published!