RGV Pawan Kalyan : జ‌న‌సేనానిపై ఆర్జీవీ సెటైర్

వారాహిపై షాకింగ్ కామెంట్స్

RGV Pawan Kalyan : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక ర‌కంగా సెటైర్లు వేయ‌డంలో , ఎవ‌రికీ అర్థం కాకుండా ట్వీట్ చేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొండ‌గ‌ట్టు కు వెళ్లారు. అక్క‌డ త‌న ప్ర‌చార రథం వారాహికి పూజ‌లు చేశారు. తాను కూడా అంజ‌న్న‌ను మొక్కుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం, తాను ఎందుకు పార్టీ పెట్టింది, తాను ఏపీకి ఏం చేయ‌బోతున్న‌ది, ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌న ఎలా ఉంద‌నే దానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహికి పూజ‌లు చేయ‌డంపై తీవ్రంగా స్పందించారు రామ్ గోపాల్ వ‌ర్మ(RGV Pawan Kalyan)  అలియాస్ ఆర్జీవీ. వ‌రుస ట్వీట్ల‌తో హోరెత్తించారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం తాను త‌యారు చేయించిన వారాహి ప్ర‌చార ర‌థాన్ని పంది వాహ‌నం అంటున్నార‌ని పేర్కొన్నారు. ఆనాడు దివంగ‌త ఎన్టీఆర్ చైత‌న్య ర‌థం మీద ప్ర‌చారం చేస్తే మీరు పంది వాహ‌నం మీద తిరిగితే ఎలా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. వారంద‌రినీ జన‌సేన‌ల‌తో బ‌స్సు టైర్ల కింద తొక్కించండి అంటూ ఎద్దేవా చేశారు ఆర్జీవీ.

అలా చేయ‌డం కుద‌ర‌క పోతే క‌నీసం మీ ప‌వ‌ర్ ను ఉప‌యోగించి లీగ‌ల్ గా కేసులైనా పెట్టించాల‌ని కోరారు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు. ఇది నేను మీ ఫ్యాన్ గా కోరుతున్నాన‌ని పేర్కొన్నారు. గ‌త కొంత కాలం నుంచీ కూడా ఆర్జీవీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డిని క‌లిశారు. ఆయ‌న‌పై త్వ‌ర‌లో బ‌యో పిక్ తీస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read : రాఖీ సావంత్ ను అరెస్ట్ చేయొద్దు

Leave A Reply

Your Email Id will not be published!