MM Keeravani Padmashri : కీరవాణికి దక్కిన ‘పద్మం’
పాటకు లభించిన పురస్కారం
MM Keeravani Padmashri : తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారానికి 2022 సంవత్సరానికి గాను ఎంపిక(MM Keeravani Padmashri) చేసింది. 1961లో జూలై 4న పుట్టారు. ఆయన వయస్సు 61 ఏళ్లు. ఎంఎం కీరవాణి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. ఇతర పేరు కూడా ఎంఎం క్రీమ్ అని కూడా పిలుస్తారు.
ప్రస్తుతం కీరవాణి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ఎందుకంటే ఆయన ఇది వరకే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహు బలికి సంగీతం అందించారు. తాజాగా ఆస్కార్ రేసులో నిలిచిన జక్కన డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ ఆర్ కు కూడా కీరవాణి సంగీతం సమకూర్చారు.
స్వతహాగా సంగీత దర్శకుడే కాదు గాయకుడు, రచయిత కూడా. తండ్రి శివ శక్తి దత్తా. తెలుగులో కీరవాణిగా , తమిళంలో మరకతమణిగా , హిందీలో ఎంఎం క్రీమ్ గా పేరొందాడు. తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పని చేశారు కీరవాణి. ఉషా కిరణ్ సంస్థ 1989లో నిర్మించిన మనసు మమత చిత్రం ద్వారా కీరవాణితో ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు, తమిళ, హిందీ భాషలలో 100 సినిమాలకు పైగా సంగీతం అందించారు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. 2023లో నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. తను సంగీతం అందించిన సినిమాలలో అత్యధికంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు అందించారు. ఏకంగా 25 సినిమాలకు పని చేశారు.
Also Read : 106 మందికి పద్మ పురస్కారాలు