Mohammed Siraj : మ‌హ్మ‌ద్ సిరాజ్ నెంబ‌ర్ వ‌న్

ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్

Mohammed Siraj : హైద‌రాబాద్ కు చెందిన స్పీడ్ స్ట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్(Mohammed Siraj)  అరుదైన ఘ‌న‌త సాధించాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. స్వ‌దేశంలో జ‌రిగిన శ్రీ‌లంక‌, న్యూజిలాండ్ జ‌ట్ల‌తో జ‌రిగిన వ‌న్డే సీరీస్ ల‌లో సూప‌ర్ స్పెల్ తో దుమ్ము రేపాడు. కీల‌క వికెట్లు తీసుకుని ఏకంగా ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచాడు.

తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో 729 పాయింట్లో ఏకంగా నెంబ‌ర్ వ‌న్ ద‌క్కించుకున్నాడు. మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ ఏకంగా న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్ , ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్ వుడ్ ను దాటేశాడు . సిరాజ్ అగ్ర స్థానంలో నిలిచాడు. భార‌త జ‌ట్టు క్లీన్ స్వీప్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు ఈ బౌల‌ర్.

మ్యాచ్ మ్యాచ్ కు త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్(Mohammed Siraj)  . ఇదే స‌మ‌యంలో మ‌రో భార‌త బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ 32వ స్థానంలో నిలిచాడు ఇక ఎప్ప‌టి లాగే బ్యాటింగ్ విభాగంలో మ‌రోసారి పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ నెంబ‌ర్ వ‌న్ గా ఉన్నాడు. ప్ర‌క‌టించిన 10 ర్యాకుల‌లో భార‌త జ‌ట్టుకు చెందిన ముగ్గురు బ్యాట‌ర్లకు చోటు ద‌క్కింది.

ఇందులో ఇటీవ‌ల సెంచ‌రీలతో క‌దం తొక్కుతున్న శుభ్ మ‌న్ గిల్ 6వ స్థానంలో నిలువ‌గా విరాట్ కోహ్లీ 7వ స్థానంలో ఉండ‌గా రోహిత్ శ‌ర్మ 8వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇదిలా ఉండ‌గా భార‌త్ లో త్వ‌ర‌లో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఆసియా క‌ప్ పాకిస్తాన్ లో కొన‌సాగ‌నుంది. టీమిండియా ప్ర‌పంచ క‌ప్ పై ఫోక‌స్ పెట్ట‌నుంది.

Also Read : అజ్జూ భాయ్ పై బాసిత్ అలీ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!