Haroon Rashid : పీసీబీ చీఫ్ సెలెక్టర్ గా హరూన్ రషీద్
ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్
Haroon Rashid : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన ప్రకటన చేసింది. పీసీబీ చీఫ్ సెలెక్టర్ గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హరూన్ రషీద్ ను నియమించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
పురుషుల జాతీయ సెలక్షన్ కమిటీకి చీఫ్ గా ఉంటారని తెలిపింది. మాజీ అంతర్జాతీయ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు హరూన్ రషీద్(Haroon Rashid). అయితే ప్రస్తుతానికి చీఫ్ సెలెక్టర్ ను మాత్రమే ప్రకటించింది పీసీబీ. మిగిలిన ప్యానెల్ ను గడువులోగా ప్రకటించనుంది.
ఇక హరూన్ రషీద్ విషయానికి వస్తే 1977 నుండి 1983 మధ్య 23 టెస్టులతో పాటు 12 వన్డే మ్యాచ్ లు ఆడాడు. అంతకు ముందు మొహమ్మద్ వాసిమ్ ను ఆ స్థానం నుండి అనూహ్యంగా తొలగించింది పీసీబీ. ఇదే సమయంలో అతడి స్థానంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదిని తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ గా నియమించింది పీసీబీ. తాజాగా షాహిద్ అఫ్రిదీ నుంచి పూర్తి బాధ్యతలు స్వీకరించారు హరూన్ రషీద్ .
గతంలో కొత్తగా నియమించిన రషీద్ పీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ , టీమ్ మేనేజర్ గా పని చేశారు. పురుషుల జట్టుకు 2015, 2016లో చీఫ్ సెలెక్టర్ గా కూడా పని చేశాడు. ఈ సందర్బంగా కొత్తగా నియమించిన హరూన్ రషీద్ కు అభినందనలు తెలిపారు పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ.
గతంలో పని చేసిన అనుభవం జట్టుకు మేలు చేకూరుతుందన్నాడు. తనను నియమించినందుకు పీసీబీ థ్యాంక్స్ చెప్పారు రషీద్(Haroon Rashid). అయితే అత్యంత క్లిష్టమైన పదవి అని, ఇది సవాల్ తో కూడుకుని ఉన్నదని పేర్కొన్నాడు.
Also Read : వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ టాప్