Kishore Biyani : ‘ఫ్యూచర్’ చైర్మన్ కిషోర్ బియానీ రిజైన్
వాస్తవికతను అంగీకరించక తప్పదు
Kishore Biyani : ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) చైర్మన్ కిషోర్ బియానీ రాజీనామా చేశారు. 2007 నుండి దానితో అనుబంధం కలిగి ఉన్న కిషోర్ బియానీ దురదృష్టకర వ్యాపార పరిస్థితి కారణంగా వైదొలగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్ఎసీఎల్టీ ముందు దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్నందు వల్ల కంపెనీ చైర్మన్ , డైరెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కిషోర్ బియానీ(Kishore Biyani) .
ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంపెనీ ఎల్లప్పుడూ నా అభిరుచి, దాని పెరుగుదల కోసం చాలా కష్టపడ్డాను. కానీ తప్పదు..వాస్తవికతను అంగీకరించక ముందుకు సాగాలని పేర్కొన్నారు కిషోర్ బియానీ. స్టాక్ ఎక్స్ఛేంజీలతో పంచుకున్న లేఖలో నేను అర్థం చేసుకున్నట్లుగా కంపెనీ , దాని ఆస్తులపై పూర్తి నియంత్రణను మీరు స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన అన్ని హ్యాండ్ హోల్డింగ్ లను పూర్తి చేశానని స్పష్టం చేశారు.
దివాలా ప్రకారం రుణదాతల కమిటీ ముందు ఉంచ బడుతుందని కంపెనీ పేర్కొంది. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ కి జనవరి 24న ఇ మెయిల్ ద్వారా సమాచారం అందింది. భారత దేశంలో రిటైల్ కింగ్ గా పేరు పొందారు కిషోర్ బియానీ. ఆధునిక రిటైల్ కు మార్గదర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎఫ్ఆర్ఎల్ కింద బిగ్ బజార్ , ఈజీడే, ఫుడ్ హాల్ వంటి బ్రాండ్ ల కింద హైపర్ మార్కెట్ , సూపర్ మార్కెట్, హోమ్ విభాగాలకు విస్తరించేలా చేశాడు. కిషోర్ బియానీ (Kishore Biyani)కారణంగా దేశంలో ఎఫ్ఆర్ఎల్ 430 నగరాల్లో 1,500 అవుట్ లెట్ లను కలిగి ఉంది.
Also Read : 50 నగరాల్లో జియో 5జీ సేవలు