Hindenburg Report : త‌ప్పుడు లెక్క‌ల్లో అదానీ గ్రూప్ టాప్

యుఎస్ రీసెర్చ్ సంస్థ షాకింగ్ కామెంట్స్

Hindenburg Report : ప్ర‌పంచంలోని కుబేరుల్లో టాప్ లో కొన‌సాగుతూ వ‌స్తున్న అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. అదానీ సంస్థ చెబుతున్న లెక్క‌లు, చూపిస్తున్నవ‌న్నీ దొంగ లెక్క‌లేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది హిండెన్ బ‌ర్గ్(Hindenburg Report) ప‌రిశోధ‌న సంస్థ‌. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా మొత్తం అదానీ గ్రూప్ సంస్థ‌లోని కంపెనీలు, లావాదేవీల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తూ వ‌చ్చామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు త‌మ వ‌ద్ద అందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయ‌ని పేర్కొంది. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌ని స్ప‌ష్టం చేసింది. దొంగ లెక్క‌ల‌తో ఇన్వెస్ట‌ర్ల‌ను అదానీ గ్రూప్ సంస్థ బురిడీ కొట్టించి మోసం చేసిందంటూ ఫైర్ అయ్యింది . ఇదిలా ఉండ‌గా అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌తో ఒక్క‌సారిగా షేర్ మార్కెట్ లో అదానీ షేర్లు భారీగా ప‌డి పోయాయి.

అదానీ ఎంట‌ర్ ప్రైజెస్ రూ. 20,000 కోట్ల మ‌లి విడ‌త ప‌బ్లిక్ ఆఫ‌ర్ ఈనెల 27నుంచి 31న జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో అదానీ గ్రూప్ షేర్లు భారీగా న‌ష్ట పోయాయి. అదానీ గ్రూప్ కరేబియ‌న్ , మారిష‌స్ ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం షెల్ కంపెనీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది.

గ‌తంలో అదానీ గ్రూప్ కంపెనీలలో ప‌ని చేసిన సీనియ‌ర్ల‌ను , మాజీల‌ను క‌లిసి వేలాది ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌ని తెలిపింది సంస్థ‌. పూర్తి ఆధారాల‌తో తాము ఆరోప‌ణ‌లు చేస్తున్నామ‌ని అదానీ గ్రూప్ ఎక్క‌డికి వెళ్లినా చూపించేందుకు రెడీగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది.

Also Read : ‘ఫ్యూచ‌ర్’ చైర్మన్ కిషోర్ బియానీ రిజైన్

Leave A Reply

Your Email Id will not be published!