Adani Group Hindenburg : హిండెన్‌బర్గ్ పై అదానీ గ్రూప్ దావా
న్యాయ పరమైన చర్యలకు సిద్దం
Adani Group Hindenburg : అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ బాంబు పేల్చడంతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేక్ కు గురైంది. షేర్ మార్కెట్ లో అదానీ షేర్లు ఢమాల్ మన్నాయి.
గత రెండు సంవత్సరాలుగా అదానీ గ్రూపు భారీ ఎత్తున తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని, దీని వల్ల పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతోందంటూ ఆరోపించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కు చెందిన మొత్తం లావాదేవీలను తాము క్షుణ్ణంగా పరిశీలించామని దీంతో అసలు వాస్తవం బయట పడిందని వెల్లడించింది.
దీంతో అదానీ గ్రూప్ యుఎస్ హిడెన్ బర్గ్(Adani Group Hindenburg) పరిశోధన సంస్థపై కారాలు మిరియాలు నూరుతోంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమని కొట్టి పారేసింది అదానీ గ్రూప్ . హిడెన్ బర్గ్ రీసెర్చ్ గ్రూప్ పై న్యాయ పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. సందరు సంస్థ ఆరోపించినట్లు తమ ఖాతాల్లో మోసాలకు పాల్పడలేదంటూ క్లారిటీ ఇచ్చింది అదానీ గ్రూప్ .
తమ సంస్థను కావాలని డ్యామేజ్ చేసేందుకే హిడెన్ బెర్గ్ రీసెర్చ్ గ్రూప్ ప్రయత్నం చేసిందని ఆరోపించింది. తమ సంస్థకు నష్టం వాటిల్లే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది అదానీ గ్రూప్ .
ఈ మేరకు సదరు కంపెనీకి అల్టిమేటం కూడా జారీ చేసింది. న్యాయ పరంగా చర్యలు తప్పవంటూ అదానీ గ్రూప్ లీగల్ హెడ్ జతిన్ జలుంద్ వాలా స్పష్టం చేశారు. ఈ సంస్థ కొట్టిన దెబ్బకు రూ. 85 వేల కోట్ల నష్టం వాటిల్లింది అదానీ గ్రూప్ కు.
Also Read : తప్పుడు లెక్కల్లో అదానీ గ్రూప్ టాప్