Telangana Jobs : మ‌రో 2,391 పోస్టుల‌కు ప‌చ్చ జెండా

వెల్ల‌డించిన మంత్రి హ‌రీష్ రావు

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే 82 వేల పోస్టుల భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ ) తో పాటు ఇత‌ర బోర్డులు భ‌ర్తీ ప్ర‌క్రియను చేప‌ట్ట‌నున్నాయి. గ్రూప్ -1 కు సంబంధించి ప్రిలిమ్స్ రిజ‌ల్ట్ ప్ర‌క‌టించింది.

మెయిన్స్ ను త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నుంది. ఇక పోలిస్ రిక్రూట్ మెంట్ బోర్డు కూడా భ‌ర్తీ ప్ర‌క్రియ ప్రారంభించింది. ఇంకా టీచ‌ర్ల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్ , ట్రాన్స్ ఫ‌ర్స్ కు ఆదేశాలు జారీ చేసింది. విద్యా శాఖ ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది.

తాజాగా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా భ‌ర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మ‌రో 2,391 పోస్టులకు అనుమ‌తి(Telangana Jobs) ఇచ్చింది. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇందులో డిగ్రీ, కాలేజీ లెక్చ‌ర‌ర్స్ 480 పోస్టులు ఉండ‌గా జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్ 185 , పీజీటీ పోస్టులు 235 , టీజీటీ 324 పోస్టులు ఉన్నాయ‌ని తెలిపారు.

ఇక వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల గురుకులాల్లో 1,499 , పౌర సంబంధాల శాఖ లో 166 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఆర్థిక శాఖ మంత్రి. ఇదిలా ఉండ‌గా కొన్ని పోస్టుల‌ను తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (Telangana Jobs), మరికొన్ని పోస్టుల‌ను మెడిక‌ల్ హెల్త్ బోర్డు, మ‌హాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యా సంస్థ భ‌ర్తీ చేయ‌నుంద‌ని పేర్కొంది ప్ర‌భుత్వం. కాగా కొన్ని ప‌రీక్ష‌లు ఒకే తేదీన ఉండ‌డంతో అభ్య‌ర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read : ప‌రీక్ష స‌హ‌జం ఒత్తిడికి దూరం – మోడీ

Leave A Reply

Your Email Id will not be published!