IND vs NZ 1st T20 : భార‌త్ కు షాక్ కీవీస్ స‌క్సెస్

వ‌రుస ప‌రాజ‌యాల‌కు బ్రేక్

IND vs NZ 1st T20 : స్వ‌దేశంలో వ‌న్డే సీరీస్ లో క్లీన్ స్వీప్ చేస్తూ కోలుకోలేని షాక్ ఇచ్చిన భార‌త జ‌ట్టుకు ఊహించని రీతిలో ఓట‌మి ఎదురైంది టీ20 సీరీస్ లో. ఇప్ప‌టికే వ‌న్డే సీరీస్ ను 3-0 తేడాతో న్యూజ‌లాండ్ ను భారీ దెబ్బ కొట్టింది. దీనికి ప్రతీకారంగా రాంచీ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో స‌త్తా చాటింది. ఏకంగా 21 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది కీవీస్.

ఈ విక్ట‌రీతో 1-0 తేడాతో ముందంజ‌లో ఉంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్(IND vs NZ 1st T20) నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 176 ప‌రుగులు చేసింది. 177 ర‌న్స్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త్ స‌త్తా చాట లేక పోయింది. కేవ‌లం 9 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది టీమిండియా.

వ‌న్డేలో సెంచ‌రీలతో క‌దం తొక్కిన శుభ్ మ‌న్ గిల్ 7 ప‌రుగులే చేస్తే దంచి కొడ‌తాడ‌ని అనుకున్న ఇషాన్ కిష‌న్ 4 ప‌రుగుల‌కే చాప చుట్టేశాడు. ఇక రాహుల్ త్రిపాఠి సున్నాకే ఔటై నిరాశ ప‌రిచాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన సూర్య కుమార్ యాద‌వ్ 47 ర‌న్స్ చేస్తే హార్దిక్ పాండ్యా 21 ప‌రుగులు చేసి ఆశ‌లు పెంచారు విజ‌యంపై.

ఈ ఇద్ద‌రూ క‌లిసి నాలుగో వికెట్ కు 68 ర‌న్స్ చేశారు. అనంత‌రం సుంద‌ర్ బ‌రిలోకి దిగాక సీన్ మారింది. అద్భుతంగా ఆడి హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. కానీ ఫ‌లితం లేక పోయింది. అంత‌కు ముందు బ‌రిలోకి దిగిన కీవీస్ 6 వికెట్లు కోల్పోయి 176 ర‌న్స్ చేసింది. మిచెల్ 59 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిస్తే కాన్వే 52 ర‌న్స్ చేసి రాణించాడు.

Also Read : వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!