GVL Narsimha Rao Jagan : బీజేపీ లక్ష్యం వైసీపీ అంతం
ఎంపీ సంచలన వ్యాఖ్యలు కలకలం
GVL Narsimha Rao Jagan : భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీ ఎల్ నరసింహారావు(GVL Narsimha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాచరిక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. శనివారం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఆయన వైసీపీ సర్కార్ ను, సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ధ్వజమెత్తారు జీవీఎల్(GVL Narsimha Rao). వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఆకర్షక పథకాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణలో బీజేపీ నువ్వా నేనా అన్న రీతిలో దూసుకు పోతుంటే ఏపీలో మాత్రం బీజేపీ చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర బీజేపీ నాయకత్వం దక్షిణాదిన పాగా వేయాలని చూస్తోంది.
ఆ దిశగా పావులు కదుపుతోంది. త్వరలో కర్నాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో కూడా పూర్తిగా పాగా వేయాలని అనుకుంటోంది. ఇప్పటి నుంచే పార్టీని మరింత జనంలోకి తీసుకు వెళ్లేందుకు క్యాడర్ ను సమాయత్తం చేసే పనిలో పడింది.
ఏపీలో పాగా వేయాలంటే బలమైన అభిమానులు కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ తో జత కట్టాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార యాత్ర పూజ సందర్భంగా కొండగట్టులో ప్రకటించారు.
Also Read : కేంద్రంపై యుద్దం తప్పదు పోరాటం