Gongadi Trisha : తెలంగాణ బిడ్డ అరుదైన ఘనత
అండర్ 19 వరల్డ్ క్రికెట్ లో రికార్డ్
Gongadi Trisha : దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టును ఓడించి విశ్వ విజేత గా నిలిచింది భారత మహిళా జట్టు. టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలంకు చెందిన గొంగిడి త్రిష రెడ్డి(Gongadi Trisha). ఆమె ఆడుకోవాలని సర్వస్వం అర్పించారు పేరెంట్స్.
ఏకంగా పొలం అమ్మారు. భద్రాచలం నుండి సికింద్రాబాద్ కు మారారు. భారత మహిళా క్రికెట్ లో తొలి సారిగా అండర్ 19 జట్టు వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మొదటిసారిగా ట్రోఫీని ఏర్పాటు చేసింది. షిఫాలీ వర్మ సారథ్యంలోని భారత్ ఘన విజయాన్ని సాధించింది.
తండ్రి ఐటీసీలో ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేశాడు. కానీ కూతురి క్రికెట్ కోసం జాబ్ వదిలేశాడు. తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం. త్రిష తండ్రి కూడా ఆటగాడే. మాజీ అండర్ 16 జాతీయ హాకీ జట్టులో సభ్యుడు. స్వంతంగా ఏర్పాటు చేసుకున్న జిమ్ ను కూడా మూసి వేశాడు. తన కూతురు శిక్షణ కోసం తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించాడు. ఇదిలా ఉండగా ఫైలన్ మ్యాచ్ లో కీలకమైన 24 పరుగులు చేసి సత్తా చాటింది గొంగిడి త్రిష.
తండ్రి కలను నెరవేర్చింది కూతురు. ఏదో ఒక రోజు తన కూతురు జాతీయ జట్టులో ఆడాలన్నది ఆయన కోరిక. కానీ కన్నవారి కలలను, ఆశలను నిజం చేసింది. ఇవాళ దేశ వ్యాప్తంగా అపూర్వమైన విజయాన్ని సాధించిన అండర్ 19 భారత మహిళా జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు.
భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు సైతం ఆటగాళ్లను అభినందించారు. ఇదిలా ఉండగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏకంగా వరల్డ్ కప్ గెలిచినందుకు జట్టుకు రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది.
అంతే కాదు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. గొంగిడి త్రిష(Gongadi Trisha) తల్లిదండ్రులు మాధవి, జి రెడ్డి ల కోరిక ఒక్కటే తమ కూతురు భవిష్యత్తు కోసం తాము సర్వస్వం త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
వారి ఆశలకు అనుగుణంగా ఆచరణలో చేసి చూపించింది గొంగిడి త్రిష. కష్టపడితే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొంది.
Also Read : యుజ్వేంద్ర చాహల్ కమాల్