Barry O Farrell : భారతీయులపై ఖలిస్తానీ గ్రూప్ దాడి
బాధాకరమన్న ఆస్ట్రేలియా రాయబారి
Barry O Farrell : ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో కొందరు భారతీయులపై ఖలిస్తాన్ ఉగ్రవాద గ్రూప్ కు చెందిన వారు దాడికి పాల్పడ్డారు. దీనిపై సీరియస్ గా స్పందించింది భారత ప్రభుత్వం. అక్కడి వారికి రక్షణ కల్పించాలని కోరింది. ఇదిలా ఉండగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. దాడి చేయడంపై తీవ్రంగా స్పందించారు భారత్ లోని ఆస్ట్రేలియా రాయబారి బారీ ఓ ఫారెల్(Barry O Farrell).
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా దాడికి పాల్పడడం మంచి పద్దతి కాదన్నారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని తమ ప్రభుత్వం కూడా పూర్తిగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మరింత భద్రత కూడా పెంచిందని తెలిపారు.
ఏది ఏమైనా ఇలాంటి దుందుడుకు చర్యలను తమ సర్కార్ ఒప్పుకోదని పేర్కొన్నారు బారీ ఓ ఫారెల్(Barry O Farrell). ఈ దాడిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఖలిస్తానీ అనుకూల గ్రూప్ కు చెందిన వారు భారతీయులపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. శాంతియుతంగా నిరసన తెలియ చేయడంలో తప్పు లేదన్నారు.
కానీ అకారణంగా దాడికి పాల్పడడం మంచి పద్దతి కాదన్నారు. ఆదివారం భారతీయ జెండాను కలిగి ఉన్న ఇండియన్లపై ఖలిస్తానీ గ్రూప్ దాడికి పాల్పడింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే తాము ఈ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎవరినీ వదిలి పెట్ట కూడదని స్పష్టం చేశారు. హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదన్నారు.
Also Read : రాష్ట్రపతి ప్రసంగం సమావేశాలు ప్రారంభం