Gautam Adani Loss : 11వ స్థానానికి ప‌డిపోయిన అదానీ

3 రోజుల్లో $34 బిలియ‌న్ల న‌ష్టం

Gautam Adani Loss : అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బ‌ర్గ్ కొట్టిన దెబ్బ‌కు అదానీ గ్రూప్ కోలుకోలేక పోతోంది. భారీ షాక్ త‌గులుతోంది. ఇంకా స్టాక్ మార్కెట్ లో అదానీ షేర్లు ఢ‌మాల్ అంటున్నాయి. విచిత్రం ఏమిటంటే నిన్న‌టి దాకా అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో టాప్ లో ఉన్న అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీ ఏడో స్థానంలో ఉండ‌గా తాజాగా కేవ‌లం 3 రోజుల్లో $34 బిలియ‌న్ల‌ను కోల్పోయాడు.

దీంతో వ‌ర‌ల్డ్ రిచెస్ట్ లిస్టులో మ‌రో నాలుగు స్థానాలు కోల్పోయి 11వ స్థానానికి దిగ‌జారాడు గౌతం అదానీ(Gautam Adani Loss). కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో స‌త్ సంబంధాలు క‌లిగి ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా అమెరికాకు చెందిన ప‌రిశోధ‌న సంస్థ హిండెన్ బ‌ర్గ్ సంచ‌ల‌న నివేదిక వెల్ల‌డించింది.

అదానీ గ్రూప్ స‌మ‌ర్పించిన లెక్క‌ల‌న్నీ త‌ప్పుల త‌డ‌క‌లేనంటూ ఆరోపించింది. దీనిపై దావా వేస్తామంటూ స్ప‌ష్టం చేసింది అదానీ గ్రూప్. అయినా స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ వాల్యూ అంత‌కంత‌కూ ప‌డి పోతోంది. దీంతో దేశానికి చెందిన అత్యున్న‌త ప్ర‌భుత్వ సంస్థ‌లు ఎల్ఐసీ, ఎస్బీఐ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేశాయి అదానీ గ్రూప్ లో.

మొత్తంగా గౌతం అదానీ $84.4 బిలియ‌న్ల ప్ర‌స్తుత సంప‌ద‌తో ప్ర‌త్య‌ర్థి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ నిక‌ర విలువ $82.2 బిలియ‌న్ల కంటే ఒక స్థానం ఎక్కువ‌గా ఉంది. రేప‌టి లోగా ఆ స్థానం కూడా కోల్పోయే ప్ర‌మాదం లేక పోలేద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : ఆర్థిక మాంద్యం పిచాయ్ పై ప్ర‌భావం

Leave A Reply

Your Email Id will not be published!