Mahua Moitra Adani Group : అదానీ గ్రూప్ పై విచారణ చేపట్టాలి
టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా
Mahua Moitra Adani Group : ఓ వైపు పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరో వైపు టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా షాకింగ్ కామెట్స్ చేశారు. గత కొంత కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీకి మద్దతు తెలియ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ గ్రూప్ చైర్మన్ ఆండర్సన్ కీలక నివేదిక ప్రకటించారు.
ఇందులో సంచలన ఆరోపణలు చేశారు అదానీ గ్రూప్(Adani Group) పై. 36 పేజీల నివేదికలో అదానీ గ్రూప్ పేర్కొన్న లెక్కలన్నీ తప్పుడు తడకలేనని వెల్లడించారు. దీంతో షేర్ మార్కెట్ లో ఉన్న పళంగా భారీ ఎత్తున షేర్లు పడి పోయాయి. కేవలం మూడు రోజుల్లోనే సంపద లో భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోయారు అదానీ . $48 బిలియన్ల నష్టం వాటిల్లింది అదానీ గ్రూప్ కు. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ లో కొనసాగుతున్న అదానీ ఉన్నట్టుండి 11వ స్థానానికి పడి పోయారు.
దీనిపై తీవ్రంగా స్పందించింది టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా. తప్పుడు లెక్కలతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన అదానీ గ్రూప్ పై వెంటనే విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.
అదానీని ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం నెత్తిన పెట్టుకుందని దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసీ, ఎస్బీఐ పెట్టుబడులు ఎలా పెట్టారంటూ ప్రశ్నించారు ఎంపీ మహూవా మోయిత్రా(Mahua Moitra) . ప్రస్తుతం టీఎంసీ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : 11వ స్థానానికి పడిపోయిన అదానీ