Hindenburg Adani Group : దేశపు జెండా పేరుతో అదానీ మోసం
హిండెన్ బర్గ్ రీసెర్చ్ చీఫ్ అండర్సన్
Hindenburg Adani Group : అమెరికాకు చెందిన రీసెర్చ్ గ్రూప్ సంస్థ హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త గౌతం అదానీకి కోలుకోలేని షాక్ తగిలింది. తప్పుడు లెక్కలతో బురిడీ కొట్టించాడంటూ 36 పేజీల నివేదికను వెల్లడించింది. దీంతో స్టాక్ మార్కెట్ లో ఏకంగా $68 బిలియన్లు నష్ట పోయింది అదానీ గ్రూప్ . దీనిపై రాద్దాంతం చోటు చేసుకుంది.
హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని , కావాలని కుట్ర పన్నారంటూ అదానీ గ్రూప్ ఆరోపించింది. ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ ఎలా మోసానికి పాల్పడిందో ఆధారాలతో సహా 36 పేజీల నివేదిక వెల్లడించింది. దీనిపై సీరియస్ గా స్పందించింది అదానీ గ్రూప్ . ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ చేసిన ఆరోపణలను ఖండించింది హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ(Hindenburg).
సంస్థ చైర్మన్ ఆండర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ కోర్టులోనైనా వెళ్ల వచ్చని సవాల్ విసిరాడు. తాము లేవదీసిన ప్రశ్నలకు సగానికి పైగా జవాబులు ఇవ్వలేదని మండిపడ్డారు. సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆండర్సన్. దేశాన్ని క్రమ పద్దతిలో దోచుకుంటూ భారత జెండాను కప్పుకున్న అదానీ గ్రూప్ భారత దేశ భవిష్యత్తును అడ్డుకుందని ఆరోపించారు.
మోసం అనేది వాస్తవం.. జరిగింది నిజం..అది ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఎవరు చేసినా అది మోసమేనని గుర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతం అదానీ ఉన్నట్టుండి 11వ స్థానానికి పడి పోయాడు.
Also Read : సరైన మార్గంలో ఆర్థిక రంగం – నిర్మల