U19 Trisha Yashasri Welcome : త్రిష..యశశ్రీకి గ్రాండ్ వెల్ కమ్
స్వాగతం పలికిన మంత్రి గౌడ్
U19 Trisha Yashasri Welcome : సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రారంభించిన అండర్ -19 వరల్డ్ కప్ ను భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ ను కేవలం 68 పరుగులకే కట్టడి చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫైనల్ లో దుమ్ము రేపింది తెలంగాణ ప్రాంతానికి చెందిన క్రికెటర్లు దుమ్ము రేపారు.
గొంగిడి త్రిష, యశశ్రీ , ఫిట్ నెస్ ట్రైనర్ శాలినీ ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్ కు ఇవాళ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ , సంస్థ అధికారులు ధనలక్ష్మి, సుజాత, క్రికెట్ కోచ్ రాజశేఖర్ రెడ్డి లకు సాదర స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా గొంగిడి త్రిష రెడ్డి , యశశ్రీ (U19 Trisha Yashasri Welcome) అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా భారత జట్టును అభినందనలతో ముంచెతారు. అంతకు ముందు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ , కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ , కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతీ ఇరానీ , నిర్మలా సీతారామన్ తో పాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బాస్ బిన్నీ, కార్యదర్శి జే షా కంగ్రాట్స్ తెలిపారు.
ఇదే సమయంలో భారత జట్టుకు రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం అత్యధిక ఆదాయం కలిగిన సంస్థగా బీసీసీఐ నిలిచింది.
Also Read : క్రీడా రంగానికి రూ. 3,397 కోట్లు