Actor Ali K Viswanath : పెద్ద దిక్కును కోల్పోయాం – ఆలీ
విశ్వనాథ్ దర్శకత్వంలో నటించా
Actor Ali K Viswanath : తెలుగు సినిమా రంగం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు ప్రముఖ నటుడు ఆలీ. శుక్రవారం విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినిమా రంగానికి తీరని లోటు అని అన్నారు. ఆ మహానుభావుడి దర్శకత్వంలో శుభ సంకల్పం సినిమాలో నటించే ఛాన్స్ తనకు దక్కిందన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఇవాళ బాధగా ఉందన్నారు. ఇది వాస్తవం కాక పోయి ఉంటే బావుండేదని అన్నారు నటుడు ఆలీ(Actor Ali) .
ఆయన తీసిన ప్రతి చిత్రం ఓ కళాఖండమే. ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఒకటా రెండా ఎన్ని సినిమాలు …ప్రతి సినిమా జీవితానికి సంబంధించినదేనని కొనియాడారు. శంకరా భరణం , సిరివెన్నెల, స్వాతి ముత్యం , స్వాతి కిరణం, సప్త పది, ఓ సీత కథ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారంటూ కొనియాడారు.
ఇదిలా ఉండగా కళాపతస్వికి ఎన్నో అవార్డులు , పురస్కారాలు వరించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయననను ఘనంగా సత్కరించింది. 1992లో పద్మశ్రీ అవార్డు దక్కింది.
కె. విశ్వనాథ్ స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె. ఆయన వయస్సు 92 ఏళ్లు. తన జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం సహాయ దర్శకుడిగా పని చేశారు. 1961లో ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన కుల వ్యవస్థ, వైకల్యం, అంటరానితనం, లింగ వివక్ష, వరకట్నం, సామాజిక ఆర్థిక సవాళ్లు వంటి ఇతివృత్తాలతో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Also Read : కళాతపస్వికి మరణం లేదు