TS High Court Civil Judge Jobs : హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు
ఆన్ లైన్ లో దరఖాస్తులకు ఆహ్వానం
TS High Court Civil Judge Jobs : తెలంగాణ హైకోర్టులో కొలువుల మేళం నడుస్తోంది. ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్ , ఎగ్జామినర్ , ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసింది.
తాజాగా రాష్ట్ర హైకోర్టులోని స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో (TS High Court Civil Judge Jobs) ఖాళీగా ఉన్న 10 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్ ) పోస్టుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు గాను అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
అర్హులైన అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఈ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్ ) పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా మూడు సంవత్సరాల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్ గా ప్రాక్టీస్ చేసిన అనుభవం తప్పనిసరి. ఇక సివిల్ జడ్జి పోస్టుకు సంబంధించి వయస్సు 23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇక ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. రాత పరీక్ష , వైవా ద్వారా వాయిస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసిందా.
ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్లు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 1 వరకు గడువు విధించింది.
పూర్తి సమాచారం, దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన అధికారిక వెబ్ పోర్టల్ www.tshc.gov.in ను సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read : గ్రూప్ – 4 కు 9,51,321 దరఖాస్తులు