Shashi Tharoor Kappan : ‘ఉపా’ చట్టంపై శశి థరూర్ ఫైర్
2 ఏళ్ల తర్వాత సిద్దిక్ కప్పన్ రిలీజ్
Shashi Tharoor Kappan : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తోందంటూ మండిపడ్డారు. కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్(Kappan) ను యూపీ సర్కార్ అక్రమంగా 28 నెలల పాటు జైలులో ఉంచింది.
ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. కేంద్రం ఎందుకు తనను నిర్బంధించిందో తెలియదని కీలక కామెంట్స్ చేశారు. విదేశీ ద్రోహం ఉపా చట్టం కింద కప్పన్ అరెస్ట్ చేసి జైలులో ఉంచింది. చివరకు ఎలాంటి ఆధారాలు చూపించ లేక పోయిందని ఎద్దేవా చేశారు ఎంపీ శశి థరూర్.
సవరించిన ఉపా చట్టం వ్యక్తులను నిరవధికంగా , అభియోగాలు లేకుండా నిర్బంధించేందుకు ప్రభుత్వం అనుమతించే క్రూరమైన చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని కప్పన్ కేసు తన వైఖరిని చెప్పిందన్నారు ఎంపీ. 2020 అక్టోబర్ లో దళిత మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ పై నివేదించేందుకు యూపీలోని హత్రాస్ కు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు కప్పన్ ను.
కేరళ జర్నలిస్ట్ ను విడుదల చేయడంపై ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి సుప్రీంకోర్టు బెయిల్ కాదు జైలు అనే కామెంట్స్ ను కూడా మరోసారి ప్రస్తావించారు. గాంధీ భూమిలో కప్పన్ పట్ల అమానవీయంగా ప్రవర్తించడాన్ని ఎంపీ తప్పు పట్టారు. తాను ఆనాడే ఉపా చట్టంలో సవరణలను తప్పు పట్టానని చెప్పారు.
Also Read : కర్ణాటక బీజేపీ ఇన్ ఛార్జ్ గా ప్రధాన్