Parvez Musharraf : కాశ్మీర్ కోసం య‌త్నం ‘ప‌ర్వేజ్’ విఫ‌లం

భార‌త దేశంతో బంధం కోసం ప్ర‌య‌త్నం

Parvez Musharraf : పాకిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముషార‌ఫ్(Parvez Musharraf)  మ‌ర‌ణించారు. ఆయ‌న‌కు 79 ఏళ్లు. పాకిస్తాన్ , భార‌త్ దేశాల మ‌ధ్య ఇబ్బందిగా మారిన కాశ్మీర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చారు. కానీ కార్గిల్ యుద్దాన్ని ప్రేరేపించేలా చేశారు.

భార‌త ప్ర‌భుత్వంతో స‌త్ సంబంధం నెల‌కొల్పేందుకు ఉత్సుక‌త చూపించారు. కానీ వెను దిరిగారు. చాలా కాలంగా మీడియాకు ఇష్ట‌మైన నాయ‌కుడు. 1999లో ర‌క్త ర‌హిత తిరుగుబాటు ద్వారా పాకిస్తాన్ లో అధికారంలోకి వ‌చ్చారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ నేతృత్వంలోని పౌర ప్ర‌భుత్వాన్ని తొల‌గించారు. 2008లో బ‌ల‌వంతంగా రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

1943 ఆగ‌స్టు 11న పాత ఢిల్లీలో పుట్టారు. అక్టోబ‌ర్ లో ష‌రీఫ్ చేత ఆర్మీ చీఫ్ గా నియ‌మితుల‌య్యే ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్థాయికి ఎదిగారు. 1965 యుద్ద స‌మ‌యంలో స్పెష‌ల్ స‌ర్వీస్ గ్రూప్ లో చేరారు.

లాహోర్ డిక్ల‌రేష‌న్ పై సంత‌కం చేయ‌డం ద్వారా ద్వైపాక్షిక సంబంధాల‌లో పురోగ‌తి సాధించేందుకు ప్ర‌య‌త్నించేందుకు ష‌రీఫ్ ఆహ్వానం మేర‌కు అప్ప‌టి ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి వెళ్లారు. అక్ర‌మంగా పాకిస్తాన్ సైనికులు నియంత్ర‌ణ రేఖ ద్వారా ర‌హ‌స్యంగా చొర‌బ‌డ్డారు.

కార్గిల్ సెక్టార్ లో భీక‌ర స‌రిహ‌ద్దు సంఘ‌ర్ష‌ణ‌ను ప్రేరేపించింది. పాక్ వైపు వినాశ‌క‌రంగా ముగిసింది. భార‌త సైన్యం , వైమానిక ద‌ళం చేతిలో భారీ న‌ష్టాల‌ను చ‌వి చూసింది. ముషార‌ఫ్ , ష‌రీఫ్ మ‌ధ్య విభేదాల కార‌ణంగా 1999 అక్టోబ‌ర్ లో శ్రీ‌లంక అధికారిక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో పీఎంను తొల‌గించారు. ముషార‌ఫ్ కు మ‌ద్ద‌తుగా సైన్యం నిలిచింది. ముషార‌ఫ్ పూర్తిగా దేశాన్ని త‌న కంట్రోల్ లోకి తీసుకున్నారు.

న‌వాజ్ ష‌రీఫ్ సౌదీ అరేబియాలో బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యాడు. కార్గిల్ సంఘ‌ర్ష‌ణ జ‌రిగిన రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత జూలై 2001లో తాజ్ మ‌హ‌ల్ లోని ఆగ్రాలో శిఖ‌రాగ్ర స‌మావేశానికి వాజ్ పేయి రావాలంటూ ఆహ్వానించారు. భార‌త్ తో సంబంధాలు అంతంత మాత్రాంగ‌నే నిర్వ‌హిస్తూ వ‌చ్చారు ముషార‌ఫ్. వాజ్ పేయి, మ‌న్మోహ‌న్ సింగ్ హ‌యాంలో కాశ్మీర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు య‌త్నించాడు ప‌ర్వేజ్ .

Also Read : పాక్ మాజీ చీఫ్ ముషార‌ఫ్‌ క‌న్నుమూత‌

Leave A Reply

Your Email Id will not be published!