TS Cabinet Meeting : తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
కొద్ది సేపటికే ముగిసిన సమావేశం
TS Cabinet Meeting : సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆదివారం కీలక సమావేశం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్ట బోయే బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం కేవలం 10 నిమిషాల లోపే ముగియడం విశేషం.
శాసనసభ, శాసన మండలిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరు కావాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ జాతీయ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. బడ్జెట్ లో కేటాయింపులు, ఏయే రంగాలకు ఎంతెంత కేటాయించాలి, చేసిన ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు.
ఇందుకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా సంబంధిత శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు సమాధానం ఎలా ఇవ్వాలి అనే దానిపై సీఎం క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ ఉదయం 10. 30 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఫిబ్రవరి 6 సోమవారం ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ పై చర్చించారు. అనంతరం కేబినెట్(TS Cabinet Meeting) ఈ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఈ సారి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు టాక్.
ఎందుకంటే సీఎం ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జోరందుకుంది. రూ. 3 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండనున్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా అద్భుతంగా ప్రసంగించిన మంత్రి కేటీఆర్ ను సహచర మంత్రులు అభినందించారు.
మరో వైపు నాందేడ్ లో భారత రాష్ట్ర సమితి మొదటి భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తారు. కొద్ది సేపటి కిందటే సీఎం అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు సీఎంకు.
Also Read : హైదరాబాద్ పై ఐఎస్ఐ కన్ను