ISI Plans Hand Grenades Hyd : హైద‌రాబాద్ పై ఐఎస్ఐ క‌న్ను

వెల్ల‌డించిన జాతీయ ద‌ర్యాప్తు సంస్థ

ISI Plans Hand Grenades Hyd : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించే షాకింగ్ న్యూస్ చెప్పింది జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) . ఈ మేర‌కు హైద‌రాబాద్ లో దాడులు చేప‌ట్టేందుకు హ్యాండ్ (చేతి) తో విసిరే హ్యాండ్ గ్రెనేడ్ల‌ను పంపింద‌ని(ISI Plans Hand Grenades Hyd) స్ప‌ష్టం చేసింది.

ఆదివారం ఈ మేర‌కు ఎన్ఐఏ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హైద‌రాబాద్ లోని ప‌లు ఉగ్ర‌వాద సంబంధిత కేసుల్లో నిందితుడైన అబ్దుల్ జాహెద్ అలియాస్ జాహెద్ అలియాస్ మ‌హ్మ‌ద్ కు చెందిన హ్యాండ‌ర్లు ఈ ప‌నిని అప్ప‌గించిన‌ట్లు ప్ర‌క‌టించింది.

పీఎఫ్ఐ కార్య‌క‌లాపాల గురించి స‌మాచారం అందుకున్న త‌ర్వాత ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా సోదాలు చేప‌ట్టాయి. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ కు చెందిన ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) , చ‌ట్ట విరుద్ద‌మైన ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తోయిబా (ఎల్ఈటీ) త‌మ సానుభూతిప‌రులుకు హ్యాండ్ గ్రెనేడ్ ల‌ను అందుబాటులో ఉంచింద‌ని తెలిపింది ఎన్ఐఏ. ఒంట‌రిగా దాడులు చేసేందుకు , పేలుళ్ల‌కు కుట్ర‌లు ప‌న్నిందంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఫ‌స్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్ , జాతీయ ద‌ర్యాప్తు సంస్థ వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి 25న న‌మోదైన ఎఫ్ఐఆర్ లో ముగ్గురు హైద‌రాబాద్ వాసుల‌పై న‌మోదైన ఎఫ్ఐఆర్ , మ‌త ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల‌ను సృష్టించేందుకు బ‌హిరంగ స‌భ‌లు , ఊరేగింపుల‌పై హ్యాండ్ గ్రాండ్ ల‌ను విస‌రాల‌ని సెంట్ర‌ల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసిన నిందితుల‌కు సూచించింద‌ని ఎన్ఐఏ తెలిపింది.

జాహెద్ ఆదేశాల మేర‌కు మాజ్ , స‌మీయుద్దీన్ తో పాటు ఇత‌ర యువ‌కుల‌ను రిక్రూట్ చేసుకున్న‌ట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. జాహెద్ తో పాటు 2022 అక్టోబ‌ర్ లో హైద‌రాబాద్ లో ఉగ్ర దాడుల‌కు కుట్ర ప‌న్నినందుకు మాజ్ , స‌మీయుద్దీన్ పై కేసు న‌మోదు చేశారు.

Also Read : హిల్ల‌రీ క్లింట‌న్ గుజ‌రాత్ టూర్

Leave A Reply

Your Email Id will not be published!