CM KCR : ప్ర‌ధానులు మారినా క‌ష్టాలు త‌ప్ప‌లేదు

నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

CM KCR :  దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌వుతోంది. ప్ర‌ధానులు మారారు కానీ దేశం ప‌రిస్థితి మార లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ జాతీయ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం మ‌హారాష్ట్ర లోని నాందేడ్ లో తొలి రాష్ట్రేత‌ర బీఆర్ఎస్ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున జ‌నం వ‌చ్చారు. వారిని ఉద్దేశించి ప్ర‌సంగించారు కేసీఆర్(CM KCR).

దేశంలో స‌మూలమైన మార్పులు తీసుకు వ‌చ్చేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం జ‌వాబుదారీత‌నం లేని రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయ‌ని ఆవేద‌న చెందారు. దేశంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల ప‌ట్ల సోయి లేద‌న్నారు. ఇది రాజ‌కీయం కాదు జీవ‌న్మ‌ర‌ణ పోరాట‌మ‌న్నారు.

అలా జ‌రిగిన‌ప్పుడే దేశంలో రైతు రాజ్యం ఏర్ప‌డుతుంద‌న్నారు. అపార‌మైన వ‌న‌రులు ఉన్నా నేటికీ ఉప‌యోగించు కోలేని స్థితిలో ఉన్నామ‌ని ఎద్దేవా చేశారు. ఇంకా నేటికీ వేలాది గ్రామాలు, లక్ష‌లాది మంది జ‌నం కూటి కోసం, నీటి కోసం , బ‌తుకు దెరువు కోసం ఇబ్బందులు ప‌డుతున్నార‌ని దీనికి ప్ర‌ధాన కార‌ణం పాల‌కులేన‌ని ఆరోపించారు కేసీఆర్(CM KCR). ఇక బీఆర్ఎస్ దెబ్బ‌కు బీజేపీ ఖ‌తం కావాల‌న్నారు.

మోదీకి జ‌నం చుక్క‌లు చూపించాల‌ని పిలుపునిచ్చారు. త‌మ స‌త్తా ఏమిటో రాబోయే ఎన్నిక‌ల్లో తేలుతుంద‌న్నారు కేసీఆర్. మ‌రాఠా గ‌డ్డ ఎంతో మంది మ‌హ‌నీయుల‌కు ,పోరాట యోధుల‌కు జ‌న్మ ఇచ్చింద‌న్నారు. మాహారాష్ట్ర‌లోనే ఎందుకు ఎక్కువ‌గా రైతులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నారో ఆలోచించాల‌న్నారు. రైతుల‌కు మెరుగైన సాయం చేస్తున్నామ‌ని , రైతు బంధు దేశానికి ఆత్మ బంధువుగా మారింద‌న్నారు. 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నామ‌ని చెప్పారు.

Also Read : ముమ్మాటికీ క‌ల్వ‌కుంట్ల కుటుంబ పాల‌నే

Leave A Reply

Your Email Id will not be published!