Shashi Tharoor Musharraf : శాంతి కోసం పర్వేజ్ విఫల యత్నం
ఆయన మరణం బాధాకరం
Shashi Tharoor Musharraf : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ నాయకుడే కాదు అద్బుతమైన వక్త, అంతకు మించిన రచయిత. ఇవాళ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణించారు. ఆయన మరణించడంపై తీవ్ర సంతాపం తెలిపారు శశి థరూర్(Shashi Tharoor). ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశారు. ముషారఫ్ ఒకప్పుడు భారత దేశానికి శత్రువు అని కానీ శాంతి కోసం ప్రయత్నం చేశాడని కొనియాడారు.
అయితే ఈ శాంతి కోసం జరుగుతున్న యుద్దంలో తను విఫలం అయ్యాడని పేర్కొన్నారు శశి థరూర్. ఒకప్పుడు భారత దేశానికి శత్రువుగా ఉన్నారు. కానీ రాజ్యం బలీయమైదని తెలుసుకున్నాడు.
ఐక్య రాజ్య సమితిలో తాను పలుమార్లు మాజీ చీఫ్ ముషారఫ్ తో కలిశానని , పలు సందర్భాలలో తారస పడ్డామని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో ఎన్నో అంశాలపై చర్చించడం జరిగిందన్నారు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). ఈ మాజీ జనరల్ కు మంచి పట్టుందని , నాయకత్వంపై గురి కూడా ఉందని పేర్కొన్నారు.
2002 నుంచి 2007 మధ్య ఒకప్పుడు భారత దేశానికి నిష్కళంకమైన శత్రువు..ముషారఫ్ శాంతి కోసం నిజమైన శక్తిగా మారాడని తెలిపాడు శశి థరూర్. ఎప్పుడు కలిసినా వ్యూహాత్మకమైన ఆలోచనలతో ఉండేవాడని అన్నారు. ఇదిలా ఉండగా 79 ఏళ్ల వయస్సులో దుబాయ్ లో ఆదివారం కన్ను మూశారు. అరుదైన వ్యాధితో తుది శ్వాస విడిచాడు. ఇదిలా ఉండగా శశి థరూర్ ట్వీట్ పై బీజేపీ భగ్గుమంటోంది.
Also Read : కాశ్మీర్ కోసం యత్నం ‘పర్వేజ్’ విఫలం