Nitish Kumar Upendra : బెదిరింపులకు భయపడను – నితీశ్
ఉపేంద్ర వెళితే నష్టం ఏమీలేదన్న సీఎం
Nitish Kumar Upendra : తన రాజకీయ అనుభవంలో ఎంతో మందిని చూశానని, తనను భయపెట్టాలని అనుకోవడం, బ్లాక్ మెయిల్ చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. తన జీవిత కాలంలో ఎంతో మందిని చూశానని తాను ఒకరిని చూసి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar).
తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న ఉపేంద్ర కుష్వాహాపై నిప్పులు చెరిగారు. ఆయన లేఖ రాయడాన్ని తప్పు పట్టారు.
ఎవరు వెళ్లినా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు నితీశ్ కుమార్. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనతాదళ్ యునైటెడ్ నాయకుడు పార్టీని రక్షించడంలో శ్రద్ద చూపడం లేదంటూ ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు బీహార్ రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపాయి.
ఏకంగా సీఎం నితీశ్ కుమార్ పై బహిరంగ లేఖ రాయడం చర్చకు దారి తీసింది. దీనిపై సీరియస్ గా స్పందించారు సీఎం. ఇదంతా పని లేని వాళ్లు చేస్తున్న ప్రచారం అంటూ కొట్టి పారేశారు నితీశ్ కుమార్.
ఉపేంద్ర కుష్వాహాకు గౌరవం ఇచ్చా. సహోదరుడిగా భావించా. అంతకు మించి జీవితంలో స్థిరపడేలా చేశా. ఆపై మెరుగైన రాజకీయ జీవితాన్ని ప్రసాదించాను.
ఇంక ఇంతకంటే ఏం చేయాలో మీరే చెప్పాలని అన్నారు బీహార్ సీఎం. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఒక్కరు లేదా అంతకు మించి పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు నితీశ్ కుమార్.
Also Read : హిందూత్వం రాజ్యాంగానికి వ్యతిరేకం