IND vs AUS 1st Test : స‌మ ఉజ్జీల పోరాటానికి రెడీ

భార‌త్..ఆస్ట్రేలియా మ‌ధ్య టెస్టు

IND vs AUS 1st Test : భార‌త , ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య అస‌లైన పోరు మొద‌లు కానుంది. ఇప్పటికే ఇరు జ‌ట్లకు సంబంధించి ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా భార‌త్ లో ప‌ర్య‌టించ‌నుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు , మూడు వ‌న్డే మ్యాచ్ లు ఆడ‌నుంది.

ఇక త్వ‌ర‌లోనే భార‌త్ లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వ‌ర్యంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. మ‌రో వైపు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కు చేరాలంటే ఇరు జ‌ట్లు గెల‌వాల్సిన ప‌రిస్థితి ఉంది. అందుకే భార‌త్ , ఆస్ట్రేలియా(IND vs AUS 1st Test)  హోరా హోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఇక కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు ఈ సీరీస్ జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. అటు వ్య‌క్తిగ‌తంగా ఇటు కెప్టెన్ గా కూడా. భార‌త్ ,పాకిస్తాన్ మ‌ధ్య ఎంత ఉత్కంఠ రేపుతుందో మ్యాచ్ సేమ్ ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య కూడా టెన్ష‌న్ నెల‌కొనేలా కొన‌సాగుతాయి. ప్ర‌స్తుతం టీమిండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు భీక‌ర పోరుకు సిద్ద‌మ‌య్యాయి.

ఎవ‌రి వ్యూహాలలో వారు ఉన్నారు. గ‌వాస్క‌ర్ – బోర్డ‌ర్ సీరీస్ లో ఎవ‌రు గెలుపొందితే ఆ జ‌ట్టు టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కు చేరుకుంటుంది. ఇప్ప‌టి దాకా ఆసిస్ టాప్ లో ఉండ‌గా రెండో ప్లేస్ లో ఇండియా ఉంది.

విదర్భ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు టెస్టు మ్యాచ్ లు జ‌రిగాయి. ఇందులో నాలుగు మ్యాచ్ ల‌లో భార‌త్ విజ‌యం సాధించింది. ఒక‌టి ఓడి పోయింది మ‌రోటి డ్రా చేసుకుంది. మొత్తంగా ఆట మాత్రం మ‌రింత ఆస‌క్తిని రేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Also Read : అరుదైన రికార్డ్ కు చేరువ‌లో కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!