Bing With AI Comment : ‘బింగ్’ కానుందా కింగ్

ఏఐతో జ‌త క‌ట్టిన సెర్చ్ ఇంజ‌న్

Bing With AI Comment : టెక్నాల‌జీలో పెను విప్ల‌వం రాబోతోందా. అవున‌నే అంటున్నారు మైక్రో సాఫ్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ల‌. గ‌తంలో ఏదైనా స‌మాచారం కావాలంటే వెంట‌నే యాహూ, రీడిఫ్ , ఎక్స్ ప్లోర‌ర్ ఫార్మాట్ ల‌లో వెతికే వాళ్లం. ఇలా ఎన్నో వ‌చ్చాయి. ఇంకెన్నో రాబోతున్నాయి.

కానీ ఈ యావ‌త్ ప్ర‌పంచానికి తెలిసింది ఒకే ఒక్క‌టి గూగుల్. లోకం న‌లుమూల‌ల నుంచి ఏది కావాల‌న్నా వెంట‌నే క‌ళ్ల ముందు ఆవిష్క‌రించే అద్భుత‌మైన సాధ‌నంగా ..ఆయుధంగా మారింది గూగుల్. సామాన్యుడి నుంచి ధ‌న‌వంతుడి దాకా ప్ర‌తి ఒక్క‌రు గూగుల్ పైన ఆధార‌ప‌డిన వాళ్లే.

ప్రారంభించిన కొద్ది కాలంలోనే వ‌ర‌ల్డ్ ను త‌న గుప్పిట్లోకి తీసుకుంది. అయినా సాధ‌కులు, టెక్ నిపుణులు ఇంకా శోధిస్తూనే ఉన్నారు. గూగుల్ కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రొక‌టి తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నాల‌లో మునిగి పోయారు. 

వేలాది మంది కృషి చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు ధీటుగా ఎదుర్కొనే స‌త్తా క‌లిగిన సెర్చింగ్ ఇంజ‌న్ రావ‌చ్చు.. చెప్ప‌లేం..ఎందుకంటే టెక్నాల‌జీలో ఏదీ శాశ్వతం కాదు.

ప్ర‌స్తుతం చోటు చేసుకున్న ప‌రిణామాలు కీల‌క‌మైన గూగుల్ కు చెక్ పెట్టే దిశ‌గా మైక్రోసాఫ్ట్ కు చెందిన బింగ్ రూపొందుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో సిఇఓ స‌త్య నాదెళ్ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కృత్రిమ మేధ ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది సాంకేతిక రంగంలో. ఇప్పుడు ఏఐతో బింగ్ ను అనుసంధానించ‌డం కీల‌క మార్పు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ ఒక్క టూల్ ను అనుసంధానం చేయ‌డంతో బింగ్(Bing With AI) అద్భుతంగా మారింది. స‌మాచారానికి సంబంధించి ఏ ప‌దం శోధించినా వెంట‌నే నెట్టింట్లో ముందు ఉంచుతోంది.

ఇవాల్టి నుంచి మీ ముందు కొత్త ప్ర‌పంచం ఆవిష్క‌రించ బోతోంది అని ప్ర‌క‌టించారు స‌త్య నాదెళ్ల‌. ఆయ‌న చెప్పింది అక్ష‌రాల ఆవిష్కృత‌మైంది.

ఆవిష్క‌ర‌ణ ఆనందాన్ని అన్ లాక్ చేసేందుకు , సృష్టి అద్భుతాన్ని అనుభూతి చెందేందుకు, ప్ర‌పంచ జ్ఞానాన్ని మ‌రింత గొప్ప‌గా ఉప‌యోగించు కునేందుకు, వ్య‌క్తుల‌ను శ‌క్తివంతం చేసేందుకు దీనిని తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది మైక్రోసాఫ్ట్.

ప్ర‌తిరోజూ బిలియ‌న్ల మంది బింగ్ తో అనుసంధానం కానున్నారు. కావ‌ల్సినంత కంటెంట్ ను క‌లిగి ఉంది బింగ్. దీని వ‌ల్ల మ‌రింత ట్రాఫిక్ పెర‌గ‌నుంది. ఏఐ అనేది మాన‌వుడు సృష్టించిన అద్భుతాల‌లో ఒక‌టి.

అది యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేస్తుంద‌న‌డంలో సందేహం లేద‌ని పేర్కొన్నారు మైక్రోసాఫ్ట్ సిఇఓ. రోజుకు 10 బిలియ‌న్ల శోధ‌న‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు కొన‌సాగుతున్నాయి. 

వాటిలో స‌గానికి కూడా స‌మాధానాలు దొర‌క‌డం లేదు. ఆ స‌గాన్ని పూడ్చేందుకు బింగ్(Bing With AI) సాధ‌నంగా ఉప‌యోగ ప‌డుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇందులో శోధ‌న , బ్రౌజింగ్ , చాట్ ల‌ను ఒకే అనుభ‌వంలోకి వ‌చ్చేలా తీసుకు వ‌చ్చింది బింగ్

ఈ వెబ్ నుంచి ఎక్క‌డి నుండైనా మార్పిడి చేసుకోవ‌చ్చు.. షేర్ చేయొచ్చు. క్రియేటివిటీ క‌లిగిన వాళ్ల‌కు బింగ్ ఓ ఉప‌క‌ర‌ణ‌గా , చేతి క‌ర్ర‌గా ఉప‌యోగ ప‌డుతుంది.

అత్యంత సుల‌భంగా..వేగంగా..స‌ర‌దాగా ..హాయిగా బింగ్ లో సేద దీర వ‌చ్చ‌ని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఇది ప‌క్క‌న పెడితే గూగుల్ తో ఢీకొడుతుందా లేక దానిని అధిగ‌మిస్తుందా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : ఆర‌వ సారి పెరిగిన రెపో రేటు

Leave A Reply

Your Email Id will not be published!