IND vs AUS 1st Test : స్పిన్న‌ర్ల మ్యాజిక్ ఆసిస్ 177 ఆలౌట్

స‌త్తా చాటిన జ‌డేజా..ర‌వి అశ్విన్

IND vs AUS 1st Test : ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ కోసం జ‌రుగుతున్న సీరీస్ లో నాగ‌పూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్ లో అనుకున్న‌ట్టుగానే భార‌త జ‌ట్టు బౌల‌ర్లు స‌త్తా చాటారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జ‌ట్టు 177 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.

ర‌వీంద్ర జ‌డేజా బంతుల‌తో మ్యాజిక్ చేశాడు. టీమిండియాకు చుక్క‌లు చూపించాల‌ని క‌ల‌లు గ‌న్న ఆసిస్(IND vs AUS 1st Test)  ప్లేయ‌ర్లు ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ప్ర‌ధానంగా క‌ళ్లు చెదిరే లోపే బంతులు మెలిక‌లు తిర‌గ‌డం ఇబ్బంది పెట్టేలా చేసింది. 

జ‌డేజా దెబ్బ‌కు ఆసిస్ బ్యాట‌ర్లు నానా తంటాలు ప‌డ్డారు. జ‌డేజా 5 వికెట్లు తీసుకుంటే మ‌రో స్నిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా గాయం కార‌ణంగా దూరంగా ఉన్న జ‌డేజా వ‌చ్చీ రాగానే త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఆసిస్ బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ఎలాగూ ఆడ‌లేక వికెట్ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. దీంతో భార‌త జ‌ట్టు పూర్తిగా త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

ఇదిలా ఉండ‌గా ఇరు జ‌ట్ల‌కు ఈ సీరీస్ అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఫైన‌ల్ కు చేరాలంటే త‌ప్ప‌నిసరిగా గెలవాల్సిందే. విచిత్రం ఏమిటంటే త‌మ అద్భుత‌మైన బ్యాటింగ్ తో టాప్ ప్లేయ‌ర్లుగా పేరొందిన ల‌బుషేన్ , స్టీవ్ స్మిత్ , కోంబ్ వికెట్లు కూల్చాడు.

ఆసిస్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డేవిడ్ వార్న‌ర్ , ఖ‌వాజా వికెట్ల‌ను కోల్పోయింది. ఇక ఆసిస్ జ‌ట్టులో ల‌బుషేన్ 49 ర‌న్స్ చేస్తే స్మిత్ 37 ర‌న్స్ కే ర‌నౌట్ అయ్యాడు. కోంబ్ 31, క్యారీ 36 ర‌న్స్ చేశారంతే. ష‌మీ , సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Also Read : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా

Leave A Reply

Your Email Id will not be published!